Begin typing your search above and press return to search.

#BB17 విజేతకి దక్కింది ఎంతో తెలుసా?

హిందీ బిగ్ బాస్ మరో సీజన్‌ పూర్తి అయ్యింది. సల్మాన్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ 17 ఇటీవలే ముగించింది

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:43 AM GMT
#BB17 విజేతకి దక్కింది ఎంతో తెలుసా?
X

హిందీ బిగ్ బాస్ మరో సీజన్‌ పూర్తి అయ్యింది. సల్మాన్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ 17 ఇటీవలే ముగించింది. తాజాగా జరిగిన గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ లో స్టాండప్ కమెడియన్‌ మునావర్‌ ఫరూక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సల్మాన్ చేతుల మీదుగా బిబి 17 ట్రోపీని అందుకున్నాడు.

ప్రతిష్టాత్మక బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. అదనంగా రూ.20 లక్షలు విలువ చేసే కారు, 10 లక్షల విలువ చేసే నగలు ఇంకా పలు బ్రాండ్స్ కు సంబంధించిన బహుమానాలు కూడా మునావర్ ఫరూక్‌ దక్కించుకున్నాడు.

మొత్తంగా ఫరూక్ కి బిగ్ బాస్ 17 గెలవడం వల్ల దాదాపుగా కోటి రూపాయలు అదనంగా పారితోషికం దక్కినట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా అటు ఇటుగా కోటిన్నర రూపాయల వరకు మునావర్ ఫరూక్‌ తన ఖాతాలో వేసుకుని ఉంటాడు.

అంతకు మించి ప్రేక్షకుల అభిమానం మరియు సినిమాల్లో ఛాన్స్ లను కూడా మునావర్ ఫరూక్‌ దక్కించుకోబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌ స్వయంగా ఫరూక్‌ పట్ల సానుకూలంగా ఉండటం వల్ల కచ్చితంగా మంచి ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మునావర్‌ ఫరూక్‌ షో లో అడుగు పెట్టినప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం లో సఫలం అయ్యాడు. కొందరు బయట ఆయన గురించి బ్యాడ్‌ గా ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన కూడా జనాలు ఆయనకు ఓట్లు వేశారు, విజేతగా నిలిపారు. ముందు ముందు మునార్ ఫరూక్‌ ఏం చేస్తాడా అనేది చూడాలి.