Begin typing your search above and press return to search.

ఈ స్టార్‌ విలన్‌ భార్య గురించి మీకు తెలుసా..!

మురళీ శర్మ తో పాటు ఆయన భార్య అశ్వినీ కల్‌శేఖర్ నటి అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె తెలుగులో నటించిన విషయం కొద్ది మందికే తెలుసు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 12:30 PM GMT
ఈ స్టార్‌ విలన్‌ భార్య గురించి మీకు తెలుసా..!
X

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్న నటుడు మురళీ శర్మ. సీరియస్ విలన్ పాత్రల్లోనే కాకుండా కామెడీ పాత్రలో మురళీ శర్మ నటించి మెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల ఆయన ముఖ్య పాత్రలో సినిమాలు వస్తున్నాయి. పవన్‌, అల్లు అర్జున్‌, మహేష్ బాబు, ప్రభాస్‌ ఇలా దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలోనూ నటించిన మురళీ శర్మ ప్రస్తుతం టాలీవుడ్‌ లో అత్యంత బిజీ అండ్‌ క్రేజీ స్టార్‌ అనడంలో సందేహం లేదు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మురళీ శర్మ నిలిచాడు.

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా మురళీ శర్మ పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కన్నింగ్ విలన్‌ పాత్రలో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మురళీ చేసిన ఎక్కువ శాతం పాత్రలు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం మురళీ శర్మ తెలుగు తో పాటు పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మురళీ శర్మ తో పాటు ఆయన భార్య అశ్వినీ కల్‌శేఖర్ నటి అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె తెలుగులో నటించిన విషయం కొద్ది మందికే తెలుసు.

మరాఠీ టెలివిజన్‌ రంగం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అశ్వినీ కల్‌శేఖర్‌ ఆ తర్వాత సినిమాల్లో నటించింది. మరాఠి సినిమాల ద్వారా బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఈ అమ్మడు పరిచయం అయింది. హిందీలో ఈమె చాలా సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియాలో అశ్వనీ కల్‌శేఖర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. నటిగా తెలుగులో ఈమె ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. భర్త మురళీ శర్మ మాదిరిగానే అశ్వినీ కల్‌శేఖర్ ఎక్కువ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించింది.

తెలుగు సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌ హీరోగా నటించిన బద్రినాథ్‌ సినిమాలో విలన్‌ సర్కార్‌ పాత్రకు భార్య గా నటించింది. ఆ సినిమాలో ఈమెకు మంచి స్క్రీన్‌ ప్రజెన్స్ దక్కింది. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ఆ తర్వాత ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో వరుసగా నటిస్తున్న ఈమె బిజీ స్టార్‌ గా ఉత్తరాదిన గుర్తింపు సొంతం చేసుకుంది. భర్త సౌత్‌ లో స్టార్‌ విలన్‌ గా కంటిన్యూ అవుతూ ఉంటే, అశ్వినీ కల్‌శేఖర్‌ మాత్రం నార్త్‌ లో స్టార్‌ లేడీ విలన్ గా కంటిన్యూ అవుతోంది.