Begin typing your search above and press return to search.

టిల్లు డాడీ అందుకే ఒంట‌రివాడు!

మ‌రి ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో కూడా ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ అలాగే ఉంటుందా? అవున‌నే అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 April 2024 1:30 AM GMT
టిల్లు  డాడీ అందుకే ఒంట‌రివాడు!
X

'డీజే టిల్లు' .. 'బలగం' సినిమాలతో మురళీధర్ గౌడ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని న‌టుడిగా ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నారు. టిల్లు డాడీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించిన న‌టుడు. స‌హ‌జ‌మైన న‌ట‌న‌..త‌న‌దైన మార్క్ డైలాగ్ డెలివిరీతోనే అది సాద్య‌మైంది. ప్ర‌స్తుతం న‌టుడిగా బిజీగా అవుతున్నాడు. ముర‌ళీ ద‌ర్ గౌడ్ కోసమంటూ కొన్ని పాత్ర‌లు క్రియేట్ అవుతున్నాయి. మ‌రి ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో కూడా ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ అలాగే ఉంటుందా? అవున‌నే అంటున్నారు.

నేను మృదు స్వభావిని . చాలా తక్కువగా మాట్లాడతాను . ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతాను. `యథార్థవాది లోక విరోధి` అని ఒక నానుడి ఉంది. అలా నిజం మాట్లాడేవారు ఎవరికి నచ్చరు . నా పరిస్థితి కూడా అంతే. సూటిగా మాట్లాడే నా స్వభావం కారణంగానే నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను ఎక్కడికీ వెళ్లి ఎవరితోనూ ఎక్కువ‌గా కబుర్లు చెప్ప‌లేను. మనం చేసేది ఎదుటివారికి నచ్చనప్పుడు .. ఎదుటివారు చేసేది మనకి నచ్చనప్పుడు ఎవరి పనులు వారు చేసుకోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం.

కష్టపడితేనే .. కష్టం విలువ తెలిస్తేనే ఎవరైనా పైకి వస్తారు. ఈ రోజున మామిడి విత్తనం మరుసటి రోజు ఉదయాన్నే పండ్ల కోసం పైకి చూస్తున్న ట్రెండ్ ఇది. యూత్ లో వందకి తొంభై మందికి తెలుకోవాలనే ఆసక్తి లేకపోవడం నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది` అని అన్నారు. ముర‌ళీధ‌ర్ గౌడ్ స్వ‌స్థ‌లం మెద‌క్ జిల్లా రామాయంపేట‌. సిద్దిపేట‌లో చ‌దువుకున్నారు. అటుపై ప్ర‌భుత్వ ఉద్యోగా కొన‌సాగారు. ఎల‌క్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్ల పాటు ప‌నిచేసారు. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చారు. తొలుత సీరియ‌ల్స్ లో న‌టించారు.

అక్క‌డ మంచి గుర్తింపు రావ‌డంతో సినిమాల్లోకి ప్ర‌మోట్ అయ్యారు. డిజేటిల్లు సినిమా అత‌ని జీవితాన్నే మార్చేసింది. ఒక్క సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. అటుపై బ‌లగంలో న‌టించారు. బాల‌కృష్ణ క‌థానాయకుడిగా న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రిలో కీల‌క పాత్ర పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. సినిమాలంటే చిన్న నాటి నుంచే ఆస‌క్తే. కానీ అప్ప‌ట్లో ధైర్యం చేయ‌లేక ప్ర‌భుత్వ ఉద్యోగిగా మారారు. రిటైర్మెంట్ త‌ర్వాత న‌టుడిగా అవ‌కాశాలు వ‌స్తాయా? రావా? ఎన్నో సందేహాల‌తో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన స‌క్సెస్ అయిన న‌టుడు.