Begin typing your search above and press return to search.

మరో రికార్డ్‌ కి ప్లాన్‌ చేస్తున్న సూపర్ ఫ్యాన్స్‌

ఇప్పుడు మరో రికార్డ్‌ కి సూపర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   3 Aug 2024 5:30 PM GMT
మరో రికార్డ్‌ కి ప్లాన్‌ చేస్తున్న సూపర్ ఫ్యాన్స్‌
X

ఆన్‌ లైన్ లో పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌, ఆఫ్ లైన్ లో మహేష్ బాబు ఫ్యాన్స్‌ ల రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ఫ్యాన్స్‌ ఇప్పటికే ఎన్నో సార్లు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో రికార్డ్‌ కి సూపర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మరో అయిదు రోజుల్లో అంటే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు రాబోతుంది. ప్రతి పుట్టిన రోజుకు మహేష్ బాబు ఫ్యాన్స్‌ హంగామా చేయడం కామన్ గా ఉంటుంది. ఈసారి మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ లేదు. అయినా కూడా సందడి మాత్రం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

ఈ బర్త్‌ డే సందర్భంగా మహేష్ బాబు హిట్‌ మూవీ మురారి ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆమధ్య మహేష్ బాబు హిట్ మూవీ రీ రిలీజ్ చేయడంతో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు అంతకు మించి, తమ రికార్డ్‌ ను తామే బ్రేక్ చేసుకోబోతున్నారు.

మురారి సినిమా గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మురారిని ఫ్యాన్స్‌ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ జెనరేషన్‌ మహేష్ బాబు ఫ్యాన్స్‌ చాలా కాలంగా మురారి ని థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నారు.

ఎట్టకేలకు మురారి సినిమా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వారంతా కూడా ఇప్పుడు ఫ్యామిలీ తో సహా వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. కేవలం ఒక్క షో లేదా ఒక్క రోజులో మురారి సినిమా వెళ్లి పోకుండా సాధ్యం అయినన్ని ఎక్కువ రోజులు ఆడేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌ గా మురారి నిలిచింది. ఈ సినిమా లో హీరోయిన్‌ గా సోనాలి బింద్రే నటించగా కీలక పాత్రల్లో సత్య నారాయణ, లక్ష్మి, రవిబాబు, శివాజీ రాజా, గొల్లపూడి, సుకుమారి, చిన్నా, నాగేంద్రబాబు నటించారు.