Begin typing your search above and press return to search.

ముర‌గ‌దాస్ హీరో ముందుగా అత‌డు కాదా?

అమీర్ ఖాన్ -ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో రూపొందిన `గ‌జినీ` అప్ప‌ట్లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   20 May 2024 3:30 PM GMT
ముర‌గ‌దాస్ హీరో ముందుగా అత‌డు కాదా?
X

అమీర్ ఖాన్ -ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో రూపొందిన `గ‌జినీ` అప్ప‌ట్లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. 17 ఏళ్ల క్రిత‌మే ఇండియన్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. 250 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి అమీర్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. త‌మిళ రీమేక్ అయినా హిందీలో మోతెక్కించిన రీమేక్ గా నిలిచింది. అమీర్ ఖాన్ యూనిక్ పెర్పార్మెన్స్ తో గ‌జ‌ని ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది.

ఇదే సినిమాలో ప్ర‌దీప్ రావ‌త్ న‌ట‌న సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లంది. అయితే ఇందులో హీరోగా న‌టించాల్సింది అమీర్ ఖాన్ కాదు...స‌ల్మాన్ ఖాన్ అంటూ ప్ర‌దీప్ రావత్ తాజాగా ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు.

`గజనీ` మూవీని హిందీలో చేస్తా’ అని మురగదాస్ నా ద‌గ్గ‌ర అన్నారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా తీయాలన్నది ఆయన ప్లాన్‌. అయితే అది సరైన ఎంపిక కాదన్నది నా అభిప్రాయం అని చెప్పా. ఎందుకంటే సల్మాన్‌కు కాస్త కోపం ఎక్కువ.

పైగా మురగదాస్‌ హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు. పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. అప్పటికే నేను `సర్పరోష్‌` వంటి చిత్రాల్లో ఆమిర్‌తో పనిచేసిన అనుభవం ఉంది. ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆయన సరైన ఎంపిక అనిపించింది.

ఆమిర్‌ఖాన్‌ సెట్స్‌లో అరవడం, కేకలు వేయడం నేనెప్పుడూ చూడలేదు. ఎవరూ అలాంటి ఆరోపణలు చేసిన సందర్భం కూడా లేదు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకుంటారు. అసభ్య పదజాలం అస్సలు వాడరు.సల్మాన్‌ను ఎంపిక చేసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అని మురుగదాస్‌తో చెప్పాను` అన్నారు.

అలా ఆ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌డానికి ప్ర‌దీప్ రావ‌త్ కూడా ఓ కార‌ణం అని తెలుస్తోంది. ఆయ‌న స‌ల్మాన్ గురించి అలా చెప్ప‌క‌పోయి ఉంటే? అందులో హీరోగా స‌ల్మాన్ అయ్యేవారు. అప్పుడు ఫ‌లితం ఎలా ఉండేదో! కానీ అమీర్ గ‌జినీకి ప‌ర్పెక్ట్ ఛాయిస్ అని రిలీజ్ అనంత‌రం అంతా ప్ర‌శంసించారు. అందుకే అంత పెద్ద విజ‌యం సాధ్య‌మైంది. కానీ ఆ కాంబోలో సినిమా మిస్ అయింది. అందుకే ఇప్పుడిద్ద‌రు `సికంద‌ర్` ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించారు. స‌ల్మాన్ ఖాన్ తో ముర‌గ‌దాస్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. స‌ల్మాన్ న‌టించిన `జైహో` సినిమాకి ముర‌గ‌దాస్ స్టోరీ అందించిన సంగ‌తి తెలిసిందే.