టీజర్ టాక్ తో హీరో అభిమానుల్లో టెన్షన్ టెన్షన్!
కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో 'మదరాసి', బాలీవుడ్ లో 'సల్మాన్ ఖాన్' తో 'సికిందర్' చిత్రాలను ఒకే ఏడాది మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 March 2025 11:53 AM IST'సర్కార్' తర్వాత మురగదాస్ కి సరైన హిట్ పడలేదు. 'సర్కార్' అనంతరం రెండేళ్ల గ్యాప్ అనంతనం చేసిన 'దర్బార్' డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మురగదాస్ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ఏకంగా నాలుగేళ్లు సమయం తీసుకున్నాడు. కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో 'మదరాసి', బాలీవుడ్ లో 'సల్మాన్ ఖాన్' తో 'సికిందర్' చిత్రాలను ఒకే ఏడాది మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ రెండు చిత్రాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలతో మురగదాస్ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. 'అమరన్' విజయంతో శివ కార్తికేయన్ పుల్ ఫాంలో ఉన్నాడు. 'అమరన్' ఏకంగా అతడిని 300 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది. ఇలాంటి సమయంలో? మరో హిట్ పడితే? శివ కార్తికేయన్ స్టార్ లీగ్ లో చేరిపోతాడు. అదే వైఫల్యం ఎదురైతే? ఆ లీగ్ లో స్థానం సుస్తిరం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలో 'మదరాసీ' సక్సెస్ శివ కార్తికేయన్ కు కూడా అంతే కీలకం. అయితే ఇక్కడో టెన్షన్ శివ కార్తికేయన్ అభిమానుల్ని వెంటాడుతుంది. ఇటీవలే 'సికిందర్' టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన టీజర్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోగా ప్రతికూల సన్నివేశం ఎదురైంది. కంటెంట్ లో మురగదాస్ మార్క్ మిస్ అయినట్లు ఉందనే విమర్శ ఎదర్కుంది. కథలో మురగదాస్ క్రియేటివిటీ కొరవడిందా? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతన్నాయి.
టీజర్ ఏ మాత్రం హైప్ తీసుకు రాలేకపోయింది. ఈ నేపథ్యంలో మదరాసి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలన్నింటికి పుల్ స్టాప్ పడంలంటే వచ్చే ప్రచార చిత్రాలే సమాధానం చెప్పాలి. ఈ రెండు సినిమాలు ఏమాత్రం అటు ఇటూ అయినా మురగదాస్ లాక్ అవ్వడం ఖాయం. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు అందించిన శంకర్ పరిస్థితి ఎలా మారిందన్నది తెలిసిందే. వరుస పరాజయాలు ఎదురవ్వడంతో? ఆయనతో సినిమాలు చేయాలంటే హీరోలు ఆలోచిస్తున్నారు.