'గజినీ-2' గుట్టు విప్పేసిన మురగదాస్!
'మదరాసి' ఓ యాక్షన్ చిత్రం. 'గజనీ' తరహాలో ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. సినిమాలో ఓ డార్క్ లవ్ స్టోరీ హైలైట్ అవుతుంది.
By: Tupaki Desk | 23 March 2025 11:58 AM ISTకోలీవుడ్ సంచలనం మురగదాస్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రాన్ని..కోలీవుడ్ లో శివకార్తికేయన్ తో 'మదరాసి' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 'సికిందర్' మార్చి 28న రిలీజ్ అవుతుంది. అనంతరం మురగదాస్ ఆ సినిమా నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తారు. అటుపై మదరాసి పెండింగ్ షూటింగ్ పైనే దృష్టి పెడతారు. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.
కానీ ఏక కాలంలో 'సికిందర్' కూడా తెరకెక్కడంతో మురగదాస్ పూర్తి స్థాయిలో మదరాసీ పై కాన్సంట్రేషన్ చేయలేకపోయారు. దీంతో ఇకపై మురగదాస్ మదరాసీపై బిజీగా ఉంటారు. అయితే 'మదరాసి' ఇంత వరకూ భారీ యాక్షన్ చిత్రమని మాత్రమే తెలిసింది. మురగదాస్ మార్క్ యాక్షన్ హైలైట్ అవుతుందని తెరపైకి వచ్చింది. కానీ 'మదరాసి' అసలు రూపం ఇదని మురగదాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
'మదరాసి' ఓ యాక్షన్ చిత్రం. 'గజనీ' తరహాలో ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. సినిమాలో ఓ డార్క్ లవ్ స్టోరీ హైలైట్ అవుతుంది. చివరి షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉంది. దాదాపు 22 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ మిడ్ లో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాం' అన్నారు. దీంతో మరోసారి గజినీ టాపిక్ నెట్టింట చర్చకొస్తుంది.
'గజినీ 'కి సీక్వెల్ గా గజినీ -2 చేయాలని అభిమానులు చాలా కాలంగా మురగదాస్ ని వివిధ వేదికలపై అడుగుతున్నారు. కానీ వాటిపై ఏనాడు మురగదాస్ సరైన సమాధానం ఇవ్వలేదు. తాజాగా మదరాసి చిత్రమే గజనీలా ఉంటుందని చెప్పడంతో? ప్రాజెక్ట్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. మరి ఇది గజినీలా ఉంటుందా? లేక గజినీకి సీక్వెల్ గా విషయం చెప్పకుండా దాస్తున్నారా? అన్నది మరికొంత మంది సందేహం.