అలా ఫీలైపోతే కష్టం బాసూ!
ఇటీవల ఓ మ్యూజిక్ డైరెక్టర్ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Nov 2024 6:45 PM GMTమనోభావాలు దెబ్బతిన్నప్పుడు మనసులో ఆవేదన బయటకు తేవడంలో తప్పులేదు. నిజంగా అలా జరిగినప్పుడు? తన స్వేచ్ఛను కోల్పోయినప్పుడు ఓపెన్ అవ్వడం అన్నది మనిషి సహజ ధర్మం. కానీ అలా జరిగిందని అతిగా ఆలోచించి కడుపు చించుకుంటేనే కాలు మీద పడుతుంది. తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అదే జరిగిందని నెటి జనులు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ మ్యూజిక్ డైరెక్టర్ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
మరోసారి అదే తరహా వివాదం పై రకరకాల కథనాలు రావడంతోనే ఈ చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే కొన్నేళ్ల క్రితం ఓ అగ్ర హీరో సినిమా వేదిక పై దర్శకుడు తనని ఏదో అన్నాడని....స్పాట్ లోనే ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన పెయిన్ అంతా బయట పెట్టాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అయింది. సదరు డైరెక్టర్ జోవియల్ గా అన్నా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడంతోనే? అప్పుడా సన్నివేశం చోటు చేసుకుంది.
ఆ దెబ్బకు మళ్లీ ఆ హీరోతో సినిమా చేసే అవకాశం కూడా రాలేదు. తాజాగా ఈ మధ్య ఏకంగా నిర్మాతలతోనే లొల్లి పెట్టుకున్నట్లు వార్తలొచ్చాయి. అదీ ఆ పాత వివాదం లాంటిందే. తనని ఏదో అన్నాడని పబ్లిక్ వేదికపైనే సదరు మ్యూజిక్ డైరెక్టర్ మళ్లీ ఓపెన్ అయ్యాడు. దీంతో కొన్నేళ్ల క్రితం జరిగిందే..మళ్లీ రిపీట్ అయిందని క్లారిటీ వచ్చింది. నిజానికి అలా ఫీల్ అవ్వాల్సిన సందర్భం వస్తే ఇండియన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ చాలాసార్లు ఫీలవ్వాలి ఏమో!
రెహమాన్ ని మీడియా ముఖంగానే రాంగోపాల్ వర్మ తనని చంపాలని ఉందన్నంత కోపం వచ్చేసిదని అన్నారు. రెహమాన్ ట్యూన్లు లేటుగా ఇస్తాడని...పని చెబితే డిలే చేస్తాడని చాలా మంది దర్శకులు అంటారు. నేరుగా రెహమాన్ ముఖం మీద అనకపోయినా? మీడియా ముఖంగా చాలా మంది దర్శకులు అన్నారు. కానీ రెహమాన్ వాటి గురించి ఏనాడు మాట్లాడలేదు. మళ్లీ అదే దర్శకులతో కలిసి పనిచేసాడు. ఇప్పటికీ పని చేస్తున్నాడు.
కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఓపెన్ అయి పలచన అవుతున్నాడనే విమర్శలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. ఆరకమైన మనస్తత్వం తో ఇండస్ట్రీలో రాణించడం కష్టమంటున్నారు. దర్శకుడు-సంగీత దర్శకుల మధ్య మంచి బాండింగ్ ఉంటేనే మంచి ట్యూన్స్ వస్తాయి. పాటలు హిట్ అవుతాయి. అది సరిగ్గా లేకపోతే అన్నీ సమస్యలేనని అనుభవజ్ఞులు చెబుతున్నారు.