Begin typing your search above and press return to search.

రెమ్యునరేషన్ పెంచినా టెంప్ట్ అవ్వని అనిరుద్

తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న వ్యక్తి అనిరుద్.

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:37 AM GMT
రెమ్యునరేషన్ పెంచినా టెంప్ట్ అవ్వని అనిరుద్
X

తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న వ్యక్తి అనిరుద్. కోలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలన్నింటికి కూడా సుమారు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో మేకింగ్ పరంగా నెల్సన్ దిలీప్ కి ఎంత గుర్తింపు వచ్చిందో మ్యూజిక్ పరంగా అనిరుద్ కి కూడా అంతేస్థాయిలో ప్రశంసలు లభించాయి.

మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఏకంగా పది సినిమాల వరకు ఉన్నాయి. వాటిలో పాన్ ఇండియా సినిమాలు చాలా వరకు ఉండటం విశేషం. లియో, ఇండియన్ 2 సినిమాలకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఈ మ్యూజిక్ సెన్సేషన్ ఎన్టీఆర్ దేవర మూవీకి సంగీతం అందిస్తున్నారు. దాంతో పాటుగా విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

గతంలో నాని గ్యాంగ్ లీడర్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలకి అనిరుద్ తెలుగులో మ్యూజిక్ అందించారు. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ గా సక్సెస్ అయిన కంటెంట్ పరంగా ఫెయిల్ అయ్యాయి. అయితే అనిరుద్ కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ తెలుగులో సినిమాల కోసం 10 కోట్లు ఇవ్వడనైకి దర్శకులు సిద్ధం అవుతున్నారు.

దేవర మూవీ కోసం అతను కెరియర్ లో అత్యధికంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడంట. పెద్ద హీరోల సినిమాల కోసం చాలా మంది అనిరుద్ ని సంప్రదిస్తున్నారంట. ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్ ల నేపథ్యంలో తెలుగు సినిమాలకి అతను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంట. ఎవరైన తన దగ్గరకి వచ్చిన కూడా తనకు టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తానని, అంత వరకు వెయిట్ చేయాలని తెగేసి చెబుతున్నారంట.

ఒకవేళ కుదరదు అంటే వేరొక మ్యూజిక్ డైరెక్టర్ ని చూసుకోవాలని చెప్పేస్తున్నారంట. ప్రస్తుతం అతనికి మాతృభాషలో ఉన్న డిమాండ్, క్రేజ్ కారణంగా అనిరుద్ ఫస్ట్ ప్రయారిటీ కూడా తమిళ్ సినిమానే అవుతోంది. లాంగ్ రన్ టైం ఉన్న మూవీస్ మాత్రమే తెలుగులో చేయాలని అనుకుంటున్నారట.