Begin typing your search above and press return to search.

వామ్మో.. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ కి రూ.10 కోట్లు?

ఈ మధ్య కాలంలో సౌత్‌ హీరోలు, దర్శకులు బాలీవుడ్‌ హీరోలు, దర్శకులను మించి పారితోషికం తీసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   5 Sep 2023 8:14 AM GMT
వామ్మో.. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ కి రూ.10 కోట్లు?
X

ఈ మధ్య కాలంలో సౌత్‌ హీరోలు, దర్శకులు బాలీవుడ్‌ హీరోలు, దర్శకులను మించి పారితోషికం తీసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు సౌత్‌ స్టార్స్ కి ఉత్తర భారతంలో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ హీరోలకు సమానంగా చాలా మంది సౌత్ హీరోలు అక్కడ కూడా స్టార్‌ డం ను దక్కించుకోవడం తో పాటు భారీ పారితోషికం ను అందుకుంటున్నారు.

హీరోలు, దర్శకులు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం దక్కించుకుంటున్న సంగీత దర్శకులు కూడా సౌత్‌ వారే కావడం విశేషం. చాలా కాలం నుండి బాలీవుడ్ సంగీత దర్శకులతో పోల్చితే రెహమాన్ కి అత్యధిక పారితోషికం అందుతోంది. సౌత్‌ తో పాటు బాలీవుడ్ లో భారీ పారితోషికం తీసుకున్న రహమాన్‌ రేంజ్ ఈ మధ్య తగ్గినట్లే అనిపిస్తోంది.

రెహమాన్ కి దరిదాపుల్లో గతంలో ఏ సంగీత దర్శకుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయనకు పోటీగా అనిరుధ్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అనిరుధ్ వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. సక్సెస్ రేటు కూడా భారీగా ఉంది. అందుకే అనిరుధ్‌ ఏకంగా తన పారితోషికంను రూ.10 కోట్లకు పెంచారు అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ దీంతో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడా లేదంటే ముందు ముందు చేయబోతున్న సినిమాలకు అందుకుంటాడా అనేది చూడాలి.

మొత్తానికి అనిరుధ్ పారితోషికం హాట్ టాపిక్ ఆఫ్‌ ది మూవీ నేషనల్ గా మారింది. బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్ ఈ మధ్య కాలంలో సంగీతానికి అంతగా ఖర్చు చేయాలని అనుకోవడం లేదు. కనుక భారీ చిత్రాలకు తప్ప అనిరుధ్ అక్కడ వర్క్ చేసే పరిస్థితి లేదు. కాని సౌత్ లో మాత్రం వరుస సినిమాలకు సైన్‌ చేస్తూనే ఉన్నాడు.