Begin typing your search above and press return to search.

ఈ ఏడాది ట్యూన్స్ తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్స్ వీరే!

మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. 2023 టాలీవుడ్ లో పలువురు హీరోలు మంచి కం బ్యాక్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 9:30 AM GMT
ఈ ఏడాది ట్యూన్స్ తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్స్ వీరే!
X

మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. 2023 టాలీవుడ్ లో పలువురు హీరోలు మంచి కం బ్యాక్ ఇచ్చారు. మరికొందరు చిన్న హీరోలు కూడా భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికొస్తే ఈ ఏడాది కొందరు కొత్త వాళ్ళు అదరగొట్టాడు. ఈ ఇయర్ మ్యూజిక్ పరంగా ఆడియన్స్ ని అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

హేషం అబ్దుల్ వహాబ్ : విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు హేషం అబ్దుల్ వాహబ్. మలయాళం లో తన మ్యూజిక్ తో ఆకట్టుకున్న ఇతను ఖుషి ఆల్బమ్ తో తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా హేషం అబ్దుల్ అందించిన సాంగ్స్, బీజీయం సినిమాకి ప్రాణం పోసాయి. ఖుషి తర్వాత రీసెంట్ గా 'హాయ్ నాన్న'తో మరో సక్సెస్ ని అందుకున్నాడు. హాయ్ నాన్న సాంగ్స్, బీజీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఆడియన్స్ కి అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి హేషం అబ్దుల్ కంపోజ్ చేసిన సాంగ్స్, బీజీయం ప్రధాన పాత్ర పోషించాయి.

విజయ్ బుల్గానిన్ : ఈ ఇయర్ ఆడియన్స్ ఎక్కువగా డిస్కస్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో విజయ్ బుల్గానిన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. 'బేబీ' తో ఇతను క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్ సాంగ్స్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇతను బేబీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ అటెంప్ట్ తోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. బేబీ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడంలో ఇతని కంపోజిషన్ కూడా ప్రధాన పాత్ర పోషించింది.

ఎస్. ఎస్ థమన్ : ఈ ఏడాది 'వీరసింహారెడ్డి'' సినిమాతో తమన్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు ఫర్వాలేదనిపించాయి. కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలయ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. వీరసింహారెడ్డి సక్సెస్ అయినా కూడా తమన్ మీద ఈ ఇయర్ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈమధ్య తమన్ పై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. గుంటూరు కారం సాంగ్స్ విషయంలో తమన్ పై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే.

భీమ్స్ సిసిరోలియో : టాలీవుడ్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన బీమ్స్ ఈ ఇయర్ 'మ్యాడ్' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. రిలీజ్ కు ముందు సాంగ్స్ తోనే సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఫలితంగా మ్యాడ్ ఈ ఇయర్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది.

దేవిశ్రీప్రసాద్ : గత కొంతకాలంగా మ్యూజిక్ పరంగా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ 'పుష్ప' తో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' తో మరో సక్సెస్ ని అందుకున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి.