కమెడియన్ అనే ట్యాగ్ అవకాశాలకు దూరం చేసింది!
ఇండస్ట్రీలో ప్రశంసలు..విమర్శలు సర్వ సాధారణం. ట్రోలింగ్...కామెంట్లు సాధారణంగా చోటు చేసుకుంటాయి. అయితే ఇలాంటివి కొన్ని సందర్భాల్లో అవకాశాలకు దూరం చేస్తాయని తెలుస్తోంది.
By: Tupaki Desk | 23 July 2023 10:00 AM GMTఇండస్ట్రీలో ప్రశంసలు..విమర్శలు సర్వ సాధారణం. ట్రోలింగ్...కామెంట్లు సాధారణంగా చోటు చేసుకుంటాయి. అయితే ఇలాంటివి కొన్ని సందర్భాల్లో అవకాశాలకు దూరం చేస్తాయని తెలుస్తోంది. తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. `బేబి` విజయంతో సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ పేరు కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అందకు ముందు పలు సినిమాలకు పనిచేసినా వాటికి వేటికి రాని గుర్తింపు ఈసినిమాతో విజయ్ కి వచ్చింది.
చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించడంతో అందరికీ మంచి పేరొచ్చింది. అయితే ఎదిగే క్రమంలో విజయ్ పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు పడినట్లు... ఆ పరిస్థితులు కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అకథేంటే ఆయన మాటల్లోనే తెలసుకుందాం. ``సంగీత దర్శకుడిగా నాతొలి సినిమా `వారధి`. ఆ తర్వాత సప్తగిరి హీరోగా నటించిన `సప్తగిరి ఎక్స్ ప్రెస్`..`ఎల్ ఎల్ బీ` చిత్రాలకు సంగీతం అందించా. వరుసగా ఆయన సినిమాలకు పనిచేయడంతో కమెడియన్ సినిమాలకు సంగీతం ఇస్తున్నాడంటూ విమర్శించారు.
అదినాపై బలమైన ముద్రగా పడిపోయింది. దీంతో సరిగ్గా అవకాశాలు రాలేదు. అప్పటికే అప్రోచ్ అయిన వారు కూడా వెనక్కి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ పై దృష్టి పెట్టాను. సొంతంగా పాటలు చేసాను. వాటి ద్వారా మళ్లీ అవకాశాలు మొదలయ్యాయి. నేను నమ్మేది ఒక్కటే. మంచి పాట అనేది ఎప్పటికీ ఆగిపోదు. అదెప్పటికీ ప్రజల మనసుల్లో ఉంటుంది. మెలోడీ కంపోజ్ చేయగల్గితే ఏపాట అయినా చేయగలం అన్నది నా నమ్మకం.
నా సంగీతంపై అల్లు అరవింద్..బన్నీ అభినందనలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. విజయ్ దేవరకొండ మాటలు..నాని సందేశం నాకు చాలా స్పెషల్. ప్రతీ సినిమాకు నావంతుగా బెస్ట్ ఇస్తాను. కానీ హిట్ అయిన సినిమాకే పేరు వస్తుంది. `బేబి` హిట్ అవ్వడంతో ఎక్కువ పేరు వచ్చింది. తాజాగా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వస్తున్నాయి. అల్లు అరవింద్ లాంటి వాళ్లు కూడా అడుగుతున్నారు` అని అన్నారు.