ఆయన మందేస్తే ఇళయరాజా పాటలే స్టప్!
తాను మమ్ముట్టిని అత్యాచారం చేసేవాడినని అంతగా అతన్ని అభిమానిస్తానని..తప్పుగా తన వ్యాఖ్యల్ని అర్దం చేసుకోవద్దు అన్నారు.
By: Tupaki Desk | 20 Jan 2025 4:31 PM GMTకోలీవుడ్ కల్ట్ డైరెక్టర్ మిస్కిన్ నుంచి విచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తేం కాదు. ఆయన ఏ సినిమా ఈవెంట్ కి హాజరైనా? నటీనటులపై, యూనిట్ పై తన అభిమానాన్ని, ప్రేమని విచిత్రంగా పంచుకోవడం అలవాటు. గతంలో మలయాళ నటుడు మమ్ముట్టిపై అభిమానాన్ని ఎలా పంచుకున్నారో తెలిసిందే. మమ్ముట్టి అమాయకంగా పుట్టి ఉంటే? తాను మమ్ముట్టిని అత్యాచారం చేసేవాడినని అంతగా అతన్ని అభిమానిస్తానని..తప్పుగా తన వ్యాఖ్యల్ని అర్దం చేసుకోవద్దు అన్నారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలపై రకరకాల విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా పా రంజిత్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న `బాటిల్ రాధ` ప్రమోషనల్ ఈవెంట్‌లో మిస్కిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన ప్రసంగంలో మిస్కిన్ అనేక బలమైన పదాలను ఉపయోగించారు. యువ నటుల నటన , నేటి సినిమా తీరుపై ఆయన భావాల్ని వ్యక్తం చేసారు. కోలీవుడ్‌కు `బాటిల్ రాధ` ఒక పురాణ చిత్రమని, `కొట్టుక్కాలి` ప్రమాణాలతో తెరకెక్కిందన్నారు.
తాను కూడా మద్యానికి బానిస కావడం వల్లే ఈ సినిమా తనకు బాగా కలిసొచ్చిందన్నారు. మద్యం సేవించినప్పుడల్లా ఇళయరాజా పాటలే తన సైడ్ డిష్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ఎవర్నీ టార్గెట్ చేయకపోయినా? మిస్కిన్ నెటి జనులకు టార్గెట్ అయ్యారు. ఆ స్టేజ్ పై చాలా మంది సెలబ్రిటీలు ఉన్న నేపథ్యంలో మిస్కిన్ సెలబ్రిటీల పట్ల మరింత గౌరవం మాట్లాడాల్సి ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.
మరికొంత మంది మిస్కిన్‌ను వ్యాఖ్యలను సమర్థించారు. మిస్కిన్ కేవలం బలమైన పదాలతో తన భావాలను మాత్రమే వ్యక్తం చేసారని..అందులో తప్పులు వెతకాల్సిన పనిలేదన్నారు. అయితే మిస్కిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ తెరపైకి వస్తున్నాయి.