Begin typing your search above and press return to search.

భార‌త‌దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్కామ్‌పై సినిమా

హరి దేవ్ కౌశల్ యాధృచ్ఛికంగా సినీ నటులు రాహుల్ దేవ్, ముకుల్ దేవ్‌లకు తండ్రి. సుప్రోతిమ్ సేన్‌గుప్తా - కునాల్ అనెజాతో పాటు హన్సల్ మెహతా స్కామ్ ర‌చ‌యిత ఒమెర్టా ఇప్పుడు ఎస్బీఐ స్కామ్ స్క్రిప్టు ప‌నుల్లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 July 2024 3:24 AM GMT
భార‌త‌దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్కామ్‌పై సినిమా
X

భార‌త‌దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ప‌లు భారీ కుంభ‌కోణాల‌పై ఇప్ప‌టికే సినిమాలు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్లు సాధించాయి. ఇప్పుడు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్‌పై సినిమా ప్రకటించింది. హిందీ మీడియా వివ‌రాల ప్ర‌కారం.. ఈ చిత్రం 1971లో జరిగిన ఎస్బీఐ కుంభకోణం ఆధారంగా రూపొందుతోంది. ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో డబుల్ ఏజెంట్ రుస్తోమ్ నగర్‌వాలా భారీ మొత్తంలో డబ్బు దుర్వినియోగానికి పాల్పడటం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో అస‌లేం జ‌రిగింది? అన్న‌దానిని ఆస‌క్తిక‌రంగా పెద్ద తెర‌పై చూపించ‌బోతున్నారు.

దో ఔర్ దో ప్యార్, శర్మజీ కి బేటీ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకున్న తరువాత ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కామ్ నేప‌థ్యంలోని సినిమాని ప్రారంభించింది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక స్కామ్‌లలో ఒకదానిని హృద్యంగా వివ‌ర‌ణాత్మ‌కంగా తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. అప్పటి చాణక్య పురి SHO హరి దేవ్ కౌశల్ నేతృత్వంలోని ఢిల్లీ పోలీసు అధికారుల బృందం ఈ కేసుపై దర్యాప్తు చేసింది. హరి దేవ్ పోలీసాఫీస‌ర్.. అత‌డు తన‌ పనిలో అసాధారణంగా ఉండటమే కాకుండా దయార్ద్ర హృద‌యం క‌లిగిన అధికారిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌ను పండిట్‌జీ అని ఆప్యాయంగా సంబోధించేవారు. ఆయన 91వ ఏట మరణించినప్పుడు కెరీర్ లో నిజాల్ని నిర్భ‌యంగా నిగ్గు తేల్చిన ప్ర‌తిభావంతుడైన అధికారిగా పోలీసు బుక్ చరిత్రలో నిలిచారు.

హరి దేవ్ కౌశల్ యాధృచ్ఛికంగా సినీ నటులు రాహుల్ దేవ్, ముకుల్ దేవ్‌లకు తండ్రి. సుప్రోతిమ్ సేన్‌గుప్తా - కునాల్ అనెజాతో పాటు హన్సల్ మెహతా స్కామ్ ర‌చ‌యిత ఒమెర్టా ఇప్పుడు ఎస్బీఐ స్కామ్ స్క్రిప్టు ప‌నుల్లో ఉన్నారు. ప్రాథమిక, ద్వితీయ ఆధారాలు, మూలాలతో అధికారుల బృందం ఈ కేసును విస్తృతంగా పరిశోధించింద‌ని కూడా వారు తెలిపారు.

ఎలిప్సిస్ సంస్థ ఇప్ప‌టికే క‌థానాయ‌కుడైన‌ హరి దేవ్ కౌశల్ పాత్ర కోసం ఎంపిక ప్రక్రియలో ఉంది. ఈ కేసుకు కీలకమైన అనేక పాత్రలకు డెప్త్ ను, ప్రామాణికతను తీసుకువచ్చే తారాగణాన్ని ఎంపిక చేయ‌నున్నారు. ఈ సినిమా గురించి ఎలిప్సిస్ భాగస్వామి తనూజ్ గార్గ్ మాట్లాడుతూ-''గూఢచర్య శైలికి పెద్ద అభిమానిగా ఈ కేసు గురించి చదవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. ఈ కేసు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ప్రాథమిక అనుమానితుడు సహా దర్యాప్తుతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు సంఘటన జరిగిన నెలల్లోనే మరణించారు. మా తారాగణాన్ని లాక్ చేసి త్వరలో షూటింగ్‌కి వెళ్లడానికి మేము వేచి ఉండలేము'' అని అన్నారు. ''1990లో నా మొదటి ఫోటోగ్రాఫిక్ అసైన్‌మెంట్‌లు రాహుల్ దేవ్‌, ముకుల్ దేవ్‌లతో జరిగాయి. వారు వ్యక్తిగత స్నేహితులు కూడా. వారి తండ్రి హరి దేవ్ జీతో వ్యక్తిగతంగా విస్తృతంగా సంభాషించే అదృష్టం నాకు లభించింది. ఆకట్టుకునే ఈ కథకు ఆయనే హీరో కావడం కవితాత్మకం..'' అని అతుల్ క‌స్బేక‌ర్ అన్నారు.