పుష్ప-3 ర్యాంపేజ్.. మొదలయ్యేది ఎప్పుడంటే?
విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన పుష్ప-2 వాటిని అందుకుని ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
By: Tupaki Desk | 16 Dec 2024 3:39 AM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప-2: ది రూల్.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ వసూళ్లను రాబడుతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుని అలరిస్తోంది.
విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన పుష్ప-2 వాటిని అందుకుని ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే 2021లో రిలీజ్ అయిన పుష్ప: ది రైజ్ కు సీక్వెల్ గా ఆ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్-3 కూడా ఉన్నట్లు పుష్ప మేకర్స్.. సెకండ్ పార్ట్ చివర్లో కన్ఫర్మ్ చేసేశారు.
అయితే పుష్ప-2 రిలీజ్ ముందే సినిమాలో పుష్ప-3కి లీడ్ ఉంటుందనే విషయం లీక్ అయింది. ఆ తర్వాత ఫైనల్ మిక్సింగ్ ను ఫినిష్ అయినట్లు సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్ లో బ్యాక్ గ్రౌండ్ లో పుష్ప– 3 ది ర్యాంపేజ్ అని లోగో తో ఉన్న పోస్టర్ కనిపించింది. దీంతో థర్డ్ పార్ట్ టైటిల్ అప్పుడే కన్ఫర్మ్ అయిందని అర్థమైంది.
ఇక పుష్ప-2 సినిమాలో కూడా పుష్ప-3 ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. పార్ట్ 2 క్లైమాక్స్ లో పుష్పరాజ్ పై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లు చూపించారు. అలా చిన్న లీడ్ ఇచ్చారు. దీంతో పుష్ప-3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా నెటిజన్లు, సినీ ప్రియులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే పార్ట్-3 షూటింగ్ మరో రెండు సంవత్సరాల తర్వాత మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పుష్ప ఫ్రాంఛైజీ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బహుశా 2026 చివర్లో మొదలు పెట్టే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పుష్ప రెండు పార్టుల కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన అల్లు అర్జున్.. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో చెరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా కానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సుకుమార్.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో బన్నీ, సుక్కూ తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుష్ప-3 మొదలు పెడతారేమో వేచి చూడాలి.