జాట్ తో బాక్సాఫీస్ టార్గెట్: మైత్రి ప్లాన్ వెనుక అసలు రహస్యం!
ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు యాక్.
By: Tupaki Desk | 27 March 2025 2:30 AMపాన్ ఇండియా స్థాయిలో నిలవాలనే లక్ష్యంతో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తోంది. ‘జాట్’ అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్‌తో నిర్మించింది. ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు యాక్. ఇటీవలే అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో భారీ హిట్ అందుకొని 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకున్న మైత్రి సంస్థ, ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్‌ను కూడా స్ట్రాంగ్‌గా ఫోకస్ చేస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, పూర్తిగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. 'క్రాక్', 'వీర సింహా రెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాల తరువాత గోపీచంద్ మలినేనిని బోర్డ్ మీదకు తీసుకురావడం మైత్రి స్ట్రాటజీలో కీలక భాగం. మాస్ కమర్షియల్ ఫార్ములాను బాలీవుడ్ స్టార్డమ్‌తో మిక్స్ చేస్తే కొత్త మార్కెట్ తెరవచ్చని ఆలోచనతో, మైత్రి ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. జాట్‌లో సన్నీ డియోల్ పాత్రను కాంప్లీట్లీ ఇంటెన్స్‌గా డిజైన్ చేశారు, ట్రైలర్‌లోనూ అదే కనిపిస్తోంది.
‘గదర్ 2’ తర్వాత బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌కు వచ్చిన క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అన్నది ప్రధానంగా గమనించాల్సిన విషయం. గదర్ 2 సినిమా 525 కోట్ల నెట్‌తో ఊహించని హిట్టుగా నిలిచిన నేపథ్యంలో, ఆ ఫాలోయింగ్‌తో ‘జాట్’ ఓపెనింగ్‌కు భారీ బజ్ వచ్చిందన్నదే వాస్తవం. అయితే ఇది కొత్త కథ కావడంతో, కంటెంట్ పైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది. మైత్రి సంస్థకు ఇది బాలీవుడ్ మార్కెట్లో ఫుట్‌హోల్డ్ ఏర్పడేందుకు టెస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట.
ఇదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ తమ దృష్టిని ఇప్పుడు నార్త్ మార్కెట్‌పైనే పెట్టింది. ఇప్పటికే పలు బాలీవుడ్ స్టార్ హీరోలతో డిస్కషన్స్ జరుపుతూ, సౌత్ మాస్ దర్శకులతో క్రేజీ కాంబినేషన్లను రెడీ చేస్తోంది. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్స్‌తో బిజీగా చర్చలు జరుపుతున్నట్టు బహిరంగంగా వెల్లడి కాకున్నా, ఇండస్ట్రీలో టాక్ స్పష్టంగా ఉంది. మైత్రికి 'జాట్' వర్కౌట్ అయితే, బాలీవుడ్‌లో స్ట్రాంగ్ లైనప్ సెటప్ చేయడంలో ఇదే కిక్ స్టార్ట్ అవుతుంది.
మొత్తానికి ‘జాట్’ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కోసం కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, ముంబయి మార్కెట్లోకి పెద్ద ఎంట్రీ కావాలని వేసిన ప్లాన్. గదర్ 2 వలె రెస్పాన్స్ వస్తే మైత్రి అటు సౌత్, ఇటు నార్త్ ఇండస్ట్రీల్ని కలిపే వన్ ఆఫ్ ది టాప్ సంస్థగా మారడం ఖాయం. ఇప్పుడు అంతా ఈ వారం విడుదలవుతున్న 'జాట్' రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది.