Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - ప్రభాస్.. మైత్రి డబుల్ బ్లాస్ట్

అయితే మైత్రీ లైనప్ లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   6 Jan 2025 9:30 PM GMT
ఎన్టీఆర్ - ప్రభాస్.. మైత్రి డబుల్ బ్లాస్ట్
X

టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 2024 ఇయర్ ను సూపర్ హిట్ తో ముగించింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో మంచి లాభాలు అందుకుంటోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

అదే సమయంలో తమ బ్యానర్ పై రూపొందుతున్న అప్ కమింగ్ మూవీస్ పై కూడా దృష్టి పెట్టారు మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి. 2025లో పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద మరిన్ని హిట్స్ ను అందుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

అదే సమయంలో వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నారు. 2026ను ఫెస్టివల్ స్పెషల్స్ గా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ ఏడాదిని బడా హీరో సినిమాతో స్టార్ట్ చేసి.. మరో పెద్ద హీరో మూవీతో గ్రాండ్ గా ఎండ్ చేయాలని చూస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్.

అయితే మైత్రీ లైనప్ లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను మేకర్స్ ఇప్పటికే ఇచ్చారు మేకర్స్. జనవరి మూడో వారంలో తొలి షెడ్యూల్‌ మొదలు కానుందని.. ఫిబ్రవరిలో తారక్ సెట్స్ లో అడుగుపెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వార్-2 మూవీలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తున్న తారక్.. ఆ తర్వాత నీల్ తెరకెక్కించే మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. మరోవైపు, సీతారామం ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాను డిసెంబర్ స్టార్టింగ్ లో లేదా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఒకవేళ కుదిరితే 2026 దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని వినికిడి. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న‌ ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌ లో మూవీ సాగనున్నట్లు సమాచారం. ప్రభాస్ సైనికుడిగా కనిపించనుండగా.. ఫౌజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి 2026లో మైత్రీ ప్లాన్ ఎంతటి సక్సెస్ అవుతుందో చూడాలి.