మరో డైరెక్టర్‌ను బాలీవుడ్‌కు పట్టుకెళ్తున్న మైత్రీ నిర్మాతలు
ఇప్పుడదే నిర్మాతలు మరో డైరెక్టర్ ను కూడా బాలీవుడ్ కు తీసుకెళ్లాలని చూస్తున్నారట.
By: Tupaki Desk | 4 Feb 2025 6:54 AM GMTబాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్లు సినిమాలు తీయడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడేమీ కొత్తగా చేయడం లేదు. గతంలో రాఘవేంద్రరావు లాంటి సీనియర్ డైరెక్టర్లు సినిమాలు చేశారు. రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ కు వెళ్లి అక్కడ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన తర్వాత పూరీ జగన్నాథ్ కూడా బాలీవుడ్ లో తన లక్ ను చెక్ చేసుకున్నాడు కానీ అదేమీ వర్కవుట్ అవలేదు.
ఇక ప్రెజెంట్ జెనరేషన్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ కు వెళ్లి అక్కడ సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు. తన మొదటి సినిమా అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్, రెండో సినిమా యానిమల్ తో ఏకంగా రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ రెండు సినిమాలతో సందీప్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ లీడ్ రోల్ లో రూపొందుతున్న జాత్ సినిమాతో గోపీచంద్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
గోపీ మైత్రీ బ్యానర్ లో వీర సింహారెడ్డి తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గోపీకి బాలీవుడ్ ప్రాజెక్టును సెట్ చేసింది మైత్రీ నిర్మాతలే. ఇప్పుడదే నిర్మాతలు మరో డైరెక్టర్ ను కూడా బాలీవుడ్ కు తీసుకెళ్లాలని చూస్తున్నారట. అతను మరెవరో కాదు, మైత్రీ బ్యానర్ లో వాల్తేరు వీరయ్య తీసిన బాబీ కొల్లి. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా మంచి సక్సెస్ అందుకుంది.
దీంతో ఇప్పుడు బాబీని బాలీవుడ్ కు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అతనితో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నారట మైత్రీ నిర్మాతలు. కథ రెడీ అయ్యాకు దానికి తగ్గ బాలీవుడ్ హీరోతో ఆ సినిమాను చేయాలని మైత్రీ నిర్మాతలు భావిస్తున్నారు. డాకు మహారాజ్ తర్వాత బాబీ మరో సినిమాను కమిట్ అయింది లేదు. అంటే బాబీ త్వరలోనే కథను రెడీ చేసి ఓ బాలీవుడ్ హీరోకి వినిపించనున్నాడన్నమాట.