Begin typing your search above and press return to search.

మైత్రి 'జాట్'+ అజిత్ గేమ్.. క్లిక్కయితే కాసుల వర్షమే..

అయితే అజిత్ నటించిన విడామయూర్చి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నిరాశపరచడంతో అంతా గుడ్ బ్యాడ్ అగ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 5:56 AM GMT
మైత్రి జాట్+ అజిత్ గేమ్.. క్లిక్కయితే కాసుల వర్షమే..
X

టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు మూవీతో నిర్మాణ సంస్థగా ఎంట్రీ ఇచ్చి.. డెబ్యూతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలను రూపొందించింది. ఎన్నో బ్లాక్ బస్టర్లు హిట్స్ అందుకున్న మైత్రీ బ్యానర్.. ఇప్పుడు అనేక సినిమాలు నిర్మిస్తోంది.

కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. మరికొన్ని సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకొన్ని థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఒకే బ్యానర్ నుంచి రెండు స్టార్ హీరోల సినిమాలు.. కొద్ది రోజుల్లో రిలీజ్ చేయడం చాలా రేర్. కానీ మైత్రీ సంస్థ.. 2023 సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలను మైత్రీ రిలీజ్ చేయగా.. రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి డబుల్ ధమాకా ఫార్మూలాను ఫాలో అవ్వనుంది మైత్రీ సంస్థ. కోలీవుడ్ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతోపాటు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ జాట్ చిత్రాలు రిలీజ్ చేయనుంది. అది కూడా ఒకే రోజు..

అయితే అజిత్ నటించిన విడామయూర్చి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నిరాశపరచడంతో అంతా గుడ్ బ్యాడ్ అగ్లీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న బజ్ ప్రకారం.. పాజిటివ్ టాక్ వస్తే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇక వారం పర్ఫెక్ట్ గా బజ్ కొనసాగినా పెట్టిన పెట్టుబడికి 70 నుంచి 100 కోట్ల ప్రాఫిట్ రావడం పక్కా.

మరోవైపు, సన్నీ డియోల్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని జాట్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన గదర్ 2.. రీసెంట్ వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో జాట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ మూవీ అవ్వడం.. బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం.. మూవీ భారీ రెస్పాన్స్ అందుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో ఈ సినిమా క్లిక్కయితే 100 కోట్ల ప్రాఫిట్ కాదు, లెక్క అంతకుమించి కూడా ఉండవచ్చు.

మొత్తానికి ఏప్రిల్ 10వ తేదీన అటు గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇటు జాట్ మూవీ రిలీజ్ చేయనుంది మైత్రీ సంస్థ. రెండు చిత్రాలపై మంచి బజ్ ఉంది. అదే సమయంలో హైప్ కూడా క్రియేట్ అయింది. మేకర్స్ ఇంకా ప్రమోట్ చేస్తే వేరే లెవెల్ అంచనాలు ఉంటాయి. రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే.. మైత్రీకి డబుల్ జాక్ పాట్ పక్కా అని చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో..