Begin typing your search above and press return to search.

మైత్రి పవర్ఫుల్ లైనప్.. దిష్టి తగిలేలా ఉంది!

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మైత్రి కంటే ముందు వచ్చిన స్టార్ నిర్మాతలు బడా నిర్మాతలు సైతం నిర్మించలేని సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 8:01 AM GMT
మైత్రి పవర్ఫుల్ లైనప్.. దిష్టి తగిలేలా ఉంది!
X

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మైత్రి కంటే ముందు వచ్చిన స్టార్ నిర్మాతలు బడా నిర్మాతలు సైతం నిర్మించలేని సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఒక విధంగా వారు సెట్ చేస్తున్న కాంబినేషన్స్ కు లైనప్ కు దిష్టి తగిలేలా ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీతో నిర్మాణ సంస్థగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించింది. ఇప్పుడు భారీ బడ్జెట్ తో అనేక సినిమాలు చేస్తోంది.

తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు కూడా హ్యాండిల్ చేస్తుంది. అయితే పుష్ప 2 ది రూల్ మూవీతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మైత్రీ సంస్థ.. 2025లో వరుస సినిమాలను రిలీజ్ చేయనుంది. అదే సమయంలో లైనప్ లో క్రేజీ ప్రాజెక్టులను చేర్చుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లతో నిర్మిస్తోంది.

లైనప్ లో భాగంగా నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీని మార్చి 28వ తేదీన విడుదల చేయనుంది. ఆ తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు తీసుకువస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ యాక్ట్ చేస్తున్న జాట్.. ఏప్రిల్ 10న రిలీజ్ చేయనుంది. అదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని కూడా తీసుకురానుంది.

స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ RC 16 షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. 2025లోనే ఆ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు, ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా మైత్రీ సంస్థనే నిర్మిస్తోంది. ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న ప్రాజెక్ట్.. 2026లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ 2026లోనే రిలీజ్ కానుంది. త్వరలోనే ప్రకటించనున్న నాని, సీబీ చక్రవర్తి మూవీ.. అదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందట. రామ్ చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్, చిరంజీవి- బాబీ కొల్లి మూవీ.. ఈ రెండు షూటింగ్స్ కూడా 2026లో మొదలవ్వనున్నట్లు సమాచారం. మరి అప్ కమింగ్ మూవీస్ తో మైత్రీ బ్యానర్ ఎలాంటి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి.