మైత్రీ నవీన్: ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన ఘనత
ఈ అరుదైన సందర్భం నవీన్‌కి ఉన్న ప్రాధాన్యతను మరియు ఆయన సాధించిన ప్రఖ్యాతిని స్పష్టంగా సూచిస్తుంది.
By: Tupaki Desk | 22 Nov 2024 9:49 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాముఖ్యమైన నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఈ సంస్థ మొదటి నుంచి కూడా మంచి విజయాలని అందుకోవడమే కాకుండా, భారీ స్థాయి ప్రాజెక్టులను తెరకెక్కించడంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2015లో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ద్వారా ఈ సంస్థ ప్రయాణం గ్రాండ్ గా మొదలైంది. ఇన్నేళ్ళ కెరీర్ లో మైత్రి నుంచి ఎన్నో భిన్నమైన సినిమాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు ఈ సంస్థ తమ సహ వ్యవస్థాపకుడు నవీన్ యెర్నేని పుట్టినరోజు సందర్భంగా అరుదైన ఘనత సాధించినట్లు తెలియజేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న పదకొండు సినిమాల బృందాలు నవీన్ యెర్నేనిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశాయి. ఒక విధంగా ఈ తరహాలో జరగడం సినిమా చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ అరుదైన సందర్భం నవీన్‌కి ఉన్న ప్రాధాన్యతను మరియు ఆయన సాధించిన ప్రఖ్యాతిని స్పష్టంగా సూచిస్తుంది.
ఈ ప్రత్యేక పోస్టర్లలోని సినిమాలు టాలీవుడ్‌నే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేకతను చాటుతున్నాయి. వీటిలో పుష్ప 2: ది రూల్ సినిమా వెయ్యి కోట్ల రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికో సిద్ధంగా ఉంది. ఇక ఉస్తాద్ భగత్‌సింగ్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, ప్రభాస్-హను రాఘవపూడి సినిమా, రామ్‌చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ RC16 లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్స్.
అలాగే ప్రశాంత్ వర్మ-రిషబ్ శెట్టి కాంబినేషన్‌లో రూపొందుతున్న జై హనుమాన్, సన్నీ డియోల్-గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ జాట్, అజిత్-అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్-మహేష్‌బాబు పి కాంబినేషన్ RAPO22, నితిన్-వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్‌హుడ్, అలాగే ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న 8 వసంతాలు కూడా లైన్ లో ఉన్నాయి.
ఇలాంటి భారీ స్థాయి ప్రాజెక్టులకు పునాది వేస్తూ, నిర్మాతగా నవీన్ యెర్నేని ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేశారు. నవీన్ నిర్మాణ విలువలు, ప్రేక్షకుల టెస్ట్ కు తగ్గట్టుగా కథల ఎంపికపై ఆయన చూపే శ్రద్ధ ఈ ఘనతకు కారణమవుతున్నాయి. ఎంతో సౌమ్యతతో ఉంటూ, వివాదాల నుంచి దూరంగా ఉండే వ్యక్తిత్వంతో నవీన్ పరిశ్రమలో అందరి మన్ననలు పొందారు. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు చిత్ర పరిశ్రమను దాటుకుని తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ విస్తరించింది.
మలయాళంలో అదృశ్య జలకంగల్, నడికర్ వంటి చిత్రాలు, బాలీవుడ్‌లో ఫారే, జాట్ వంటి ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను అలరిస్తోంది. మైత్రీ సంస్థ తమ తదుపరి పాన్-ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ ని డిసెంబర్ 5న విడుదల చేయనుంది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉంది. మైత్రీ సంస్థ విజయాలను మరింత పటిష్టం చేస్తూ భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును తిరగరాస్తోంది.