ఫేక్ న్యూస్ పై మైత్రి వార్నింగ్
ఇదిలా ఉంటే ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ మెగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫ్యామిలీ హీరోలకి గట్టి ఝలక్ ఇచ్చాడనే ప్రచారం చేస్తున్నారు.
By: Tupaki Desk | 7 Dec 2024 4:22 AM GMT‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఏకంగా 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సంచలన రికార్డ్ సృష్టించింది. ఇండియాలోనే ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా మొన్నటి వరకు ‘ఆర్ఆర్ఆర్’ పేరు మీద ఉన్న రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేసింది. ఇప్పట్లో ఎవ్వరు అందుకోలేనంత హైట్స్ లో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఉంది.
ఇక హిందీలో కూడా మొదటి రోజు 72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీ బెల్ట్ లో ‘జవాన్’ పేరు మీద ఉన్న ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ ఈ మూవీ లాగేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ మెగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫ్యామిలీ హీరోలకి గట్టి ఝలక్ ఇచ్చాడనే ప్రచారం చేస్తున్నారు.
రియాలిటీకి దగ్గరగా సినిమాలోని కొన్ని సంభాషణలు ఉండటంతో వీటిని వైరల్ చేస్తున్నారు. ఒరిజినల్ డైలాగ్స్ ని కొంతమంది తమకి నచ్చినట్లు మార్చేసి మెగా హీరోలని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా అదనంగా కొన్ని డైలాగ్స్ వారి సొంత క్రియేటివిటీ జోడించి రాసి వాటిని కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ డైలాగ్స్ అన్ని కూడా మెగా ఫ్యామిలీ అభిమానులని హర్ట్ చేస్తున్నాయి. సినిమా చూసిన వారికి అయితే అందులో ఉన్న ఒరిజినల్ డైలాగ్స్, వాటి సందర్భం ఏంటనేది తెలుస్తుంది.
అయితే సోషల్ మీడియాలో ‘పుష్ప 2’ డైలాగ్స్ అంటూ వైరల్ అవుతోన్న సంభాషణలు అన్ని నిజం అని నమ్మితే మూవీని వీక్షించేవారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రేక్షకులు సినిమాల విషయంలో ఎక్కువగా పాజిటివిటీని ఎంకరేజ్ చేస్తారు. మూవీపైన ఉన్న పాజిటివ్ బజ్ ఆ సినిమా కలెక్షన్స్ పెరగడానికి కారణం అవుతుంది. అదే నెగిటివ్ ట్రెండ్ సినిమా కలెక్షన్స్ కచ్చితంగా దెబ్బ తీస్తాయి. ఈ విషయాన్ని నిర్మాతలు వేగంగానే గుర్తించారు. అందుకే సోషల్ మీడియాలో జరుగుతోన్న విషప్రచారంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు ‘పుష్ప 2’ చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అని ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో లేని డైలాగ్స్ ఉన్నట్లు సృష్టించి ఫేక్ ప్రచారం చేస్తోన్న వారి వీడియోలని మెగా అభిమానులు మైత్రీ మూవీ మేకర్స్ కి ట్యాగ్ చేసి వీరిపై చర్యలు తీసుకోండి అంటూ చెబుతున్నారు.