Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్… నైజాం రైట్స్ వారికే..

ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న అంతకు మించి ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 7:15 AM GMT
ది రాజాసాబ్… నైజాం రైట్స్ వారికే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చే ఏడాది రాబోతున్న మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ‘ది రాజాసాబ్’ మూవీ గురించి ఇంటర్వ్యూలలో చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న అంతకు మించి ఉంటుందని అంటున్నారు. నిజానికి ‘ది రాజాసాబ్’ చిత్రంపై చెప్పుకోదగ్గ హైప్ లేదు.

అయితే మేకర్స్ మాత్రం మెల్లగా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ‘కల్కి 2898ఏడీ’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ‘ది రాజాసాబ్’ పై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూడా ప్రభాస్ ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ లో ఈ సినిమాని చేస్తున్నారు. అలాగే సినిమాలో ప్రభాస్ ఫుల్ కామెడీ చేయబోతున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ప్రభాస్ పై మంచి డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయని థమన్ చెప్పారు.

ఇలా ఈ సినిమాకి పని చేస్తోన్న అందరూ మూవీపై ఏదో ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ చెబుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నైజాం థీయాట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ కమ్ డిస్టిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకి ఈ రైట్స్ ని మైత్రీ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సంధ్య 70MM లో ది రాజాసాబ్ చిత్రాన్ని లాక్ చేసారంట.

మిగిలిన ఏరియాలకి సంబందించి కూడా థీయాట్రికల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఏప్రిల్ 10, 2025న ‘ది రాజాసాబ్’ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఐదు భాషలలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై 400 కోట్ల వరకు థీయాట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంజయ్ దత్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఆల్ మోస్ట్ 75 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుసస్తోంది. నవంబర్ ఆఖరుకి మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రొమాంటిక్, కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ‘ది రాజాసాబ్’ చిత్రం తెరకెక్కుతోంది.