మైత్రి థియేటర్స్.. తెలంగాణలో స్ట్రాంగ్ నెట్వర్క్
ఇప్పటివరకు మైత్రి వారిపై పెద్దగా ఎలాంటి వివాదాలు కూడా రాకపోవడం గొప్ప విషయం అని చెప్పాలి.
By: Tupaki Desk | 17 Dec 2024 1:07 PM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ స్థాయిలో క్రేజీ సినిమాలను లైన్లో పెట్టిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఒకేసారి 10 సినిమాలను సైతం నిర్మించగల సత్తా ఉన్న నిర్మాతలుగా రవి, నవీన్ మంచి గుర్తింపును అనుకున్నారు అని చెప్పవచ్చు. అలాగే ఎక్కడా కూడా ఇబ్బందులు గొడవలు రాకుండా ఎంతో క్రమశిక్షణతో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు మైత్రి వారిపై పెద్దగా ఎలాంటి వివాదాలు కూడా రాకపోవడం గొప్ప విషయం అని చెప్పాలి.
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశం మొత్తంలో కూడా ఇప్పుడు సినిమాలపై అత్యధిక పెట్టుబడులు పెడుతున్న సంస్థగా మైత్రి టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఈ సంస్థ నుంచి మరిన్ని పెద్ద సినిమాలు ఎక్కువ స్థాయిలో రాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ నిర్మాణ సంస్థ థియేటర్ నెట్వేర్క్ ని స్ట్రాంగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తుండడం విశేషం.
సొంతంగా థియేటర్లను నిర్మించుకోవడమే కాకుండా పాత థియేటర్లను కొనుగోలు చేయడం లేదంటే థియేటర్ ఓనర్స్ ను భాగస్వామిగా చేసుకుంటూ కొత్త తరహాలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ థియేటర్స్ ఏషియన్ అలాగే దిల్ రాజు హస్తంలో ఉన్నాయని చెప్పవచ్చు. దిల్ రాజు డైరెక్ట్ గా కాకపోయినా ఎక్కువ స్థాయిలో థియేటర్స్ ను ఏడాదికి పైగా లీజులకు తీసుకుంటూ తనదైన శైలిలో బిజినెస్ చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు.
మరొకవైపు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా అదే తరహాలో మంచి కాంబినేషన్స్ తో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో తమకంటూ కొన్ని థియేటర్స్ ఉండాలి అని మైత్రి మూవీ మేకర్స్ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో థియేటర్స్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ లో విమల్ థియేటర్ ను చాలా గ్రాండ్ గా రిన్నోవేట్ చేసి జనాలను అట్రాక్ట్ చేశారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో కూడా సింగిల్ థియేటర్లను కొత్తగా ముస్తాబు చేస్తూ సరికొత్తగా ముందుకు సాగుతోంది. లేటెస్ట్ గా కరీంనగర్ శివ థియేటర్ ను మైత్రీ సంస్థ తీసుకుని రిన్నోవేట్ చేసింది. త్వరలో ఆ థియేటర్ ప్రారంభం కానుంది. సంక్రాంతి సినిమాలతోనే ఈ థియేటర్ హడావుడి మొదలయ్యే అవకాశం ఉంది.
ఘట్కేసర్ జగదాంబ, కల్వకుర్తి మైత్రి థియేటర్స్, దేవరకొండ శ్రీ వెంకటేశ్వర వంటి థియేటర్లు మైత్రి ఆధీనంలోనే ఉన్నాయి. 2025 మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను కొనుగోలు చేసి రిన్నోవేట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. లేదంటే థియేటర్ ఓనర్స్ తో భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి మైత్రి ఈ బిజినెస్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.