Begin typing your search above and press return to search.

మైత్రి 8 వసంతాలు… అసలు అప్డేట్ వచ్చేది ఎప్పుడంటే!

అలాగే ప్రేక్షకులు ఆ కథలు, అందులోని పాత్రలతో కనెక్ట్ అయిపోయి మూవీస్ చూస్తారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 7:36 AM GMT
మైత్రి 8 వసంతాలు… అసలు అప్డేట్ వచ్చేది ఎప్పుడంటే!
X

ఫీల్ గుడ్ లవ్ అండ్ డ్రామా మూవీస్ అంటే తెలుగులో నాగార్జున ‘గీతాంజలి’ నుంచి హను రాఘవపూడి ‘సీతారామం’ వరకు కొన్ని ఎవర్ గ్రీన్ చిత్రాలు కనిపిస్తాయి. ప్రేమకథలు అంటే ఇలా ఉండాలి అని ఆ చిత్రాలు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. ఈ సినిమాలలో కథలు చెప్పే విధానం కవితాత్మకంగా ఉంటుంది. అలాగే ప్రేక్షకులు ఆ కథలు, అందులోని పాత్రలతో కనెక్ట్ అయిపోయి మూవీస్ చూస్తారు.


అందుకే ఇవి ఎవర్ గ్రీన్ చిత్రాలుగా నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాలని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. బడా నిర్మాతలు ఇలాంటి ఫీల్ గుడ్ కథలపై బడ్జెట్ లు పెట్టడానికి సాహసించరు. వాటి రిజల్ట్ ఎలా ఉంటాయనేది క్లారిటీ లేకపోవడంతో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం అన్ని రకాల జోనర్స్ లో మూవీస్ చేస్తోంది.

ఓ వైపు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరో వైపు డిఫరెంట్ కథలతో తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. అలా తక్కువ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘8 వసంతాలు’. ‘తను’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఈ ‘8 వసంతాలు’ మూవీ తెరకెక్కుతోంది. ఫిమేల్ సెంట్రిక్ గా ఈ మూవీ ఉండబోతోందని పోస్టర్స్ బట్టి తెలుస్తోంది.

ఈ చిత్రంలో అనంతిక సునీల్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీలో సుద్ధి అయోధ్య క్యారెక్టర్ లో అనంతిక కనిపించబోతుంది. ఆ క్యారెక్టర్ టీజర్ ని దసరా కానుకగా అక్టోబర్ 12న ఉదయం 11:07 కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ టీజర్ అప్డేట్ పై రెగ్యులర్ గా పోస్టర్స్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లుక్స్ చూస్తుంటే ‘8 వసంతాలు’ కథ కచ్చితంగా కవితాత్మకంగా డిఫరెంట్ ప్రెజెంటేషన్ లో ఉండబోతోందని అర్ధమవుతోంది. ఫణీంద్ర నర్సెట్టి ఆరేళ్ళు గ్యాప్ తీసుకొని చేస్తోన్న ఈ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ టీజర్ తో మూవీ పైన ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి హేసమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖుషి, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. మరి ఈ సినిమా సాంగ్స్ ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి.