మైత్రి మూవీ మేకర్స్ డబుల్ రిస్క్.. రెండూ ఒకే రోజు!
అయితే ఈసారి రెండు బిగ్ బడ్జెట్ చిత్రాలను ఒకే రోజున విడుదల చేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని ప్రయత్నిస్తోంది.
By: Tupaki Desk | 24 Jan 2025 1:52 PM GMTతెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్, 2024లో "పుష్ప 2" తో నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు, 2025 సమ్మర్ లో కూడా తనదైన శైలిలో బ్లాస్ట్ చేసే ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి రెండు బిగ్ బడ్జెట్ చిత్రాలను ఒకే రోజున విడుదల చేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా వేటికవే డిఫరెంట్ గా ఉండబోతున్నాయి.
సన్నీ డియోల్ నటించిన "జాట్" అలాగే అజిత్ కుమార్ నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" రెండు కూడా భారీ యాక్షన్ సినిమాలే. సూపర్ హిట్ "వీరసింహా రెడ్డి" తర్వాత గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లో తెరకెక్కించిన "జాట్" తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం చివరి దశ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది.
మరోవైపు, మైత్రి మేకర్స్ ఇప్పటికే తమ తమిళ బిగ్గీ "గుడ్ బ్యాడ్ అగ్లీ" విడుదల తేదీని కూడా అదే రోజుకు బుక్ చేసుకుంది. అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇది కూడా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలు సమస్య ఏమిటంటే, "జాట్" చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తే, "గుడ్ బ్యాడ్ అగ్లీ"కి స్క్రీన్ కౌంట్ తగ్గిపోతుంది.
అదే విధంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్లపైనా ఇలాంటి ప్రభావం చూపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మైత్రి ఒక చిత్రాన్ని వాయిదా వేస్తుందా, లేక రెండు చిత్రాల్ని ఒకే రోజు విడుదల చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో 2023 సంక్రాంతి సీజన్‌లో మైత్రి "వీరసింహా రెడ్డి" "వాల్తేరు వీరయ్య" చిత్రాలను వేర్వేరు తేదీలకు ప్లాన్ చేసి సక్సెస్ సాధించింది. కానీ ఈసారి, ఒకే రోజున రెండు పెద్ద చిత్రాలను రిలీజ్ చేయడం మరింత పెద్ద రిస్క్. మరి మైత్రి ఈ డెసిషన్‌తో ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.
ఇక మైత్రి మూవీస్ రిస్క్ చేసిన ప్రతీ పెద్ద సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. పుష్ప 2ని గ్రాండ్ గా విడుదల చేయగా హిందీలో800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 1800 కోట్లను రాబట్టింది. ఇక ఆ బూస్ట్ తోనే ఇప్పుడు జాట్ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తోంది.