మైత్రీ వారి లెక్క.. 2000 కోట్లకు పైనే..
టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతోంది. శ్రీమంతుడు సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది.
By: Tupaki Desk | 26 March 2024 4:15 AM GMTటాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతోంది. శ్రీమంతుడు సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే భారీ బడ్జెట్ తో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ ప్రొడక్షన్ లో నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు 2015లో శ్రీమంతుడు చిత్రం హిట్ తర్వాత మళ్ళీ ఏడాది గ్యాప్ తీసుకొని 2016లో జనతా గ్యారేజ్ చేశారు.
2017లో మూడు సినిమాలు నిర్మించారు. 2018 నుంచి సినిమాల సంఖ్య పెంచుకుంటూ వచ్చారు. గత ఏడాది ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం విశేషం. 2023లో మలయాళం, హిందీ ఇండస్ట్రీలోకి కూడా నిర్మాణ భాగస్వాములుగా మైత్రీ మూవీ మేకర్స్ వారు అడుగుపెట్టారు. ఈ ఏడాది తమిళంలోకి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.
లో బడ్జెట్ మూవీస్ నుంచి పాన్ ఇండియా చిత్రాల వరకు అన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి నిర్మాణంలో ఉన్న అన్ని సినిమాల బడ్జెట్ లెక్కలు చూసుకుంటే 2000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. పుష్ప ది రూల్ మూవీపైన 300 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే RC17 మూవీ కూడా 300+ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నట్లు టాక్.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ కూడా 300+ కోట్ల బడ్జెట్ లోనే ఉంటుందని సమాచారం. ఇక ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ సినిమా మీద 400+ కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారంట. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 130+ కోట్ల బడ్జెట్ లో ఉండబోతోందని టాక్. తమిళంలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ 150+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వీటిలో ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప అన్ని పాన్ ఇండియా చిత్రాలే.
మీడియం రేంజ్ హీరోలైన నితిన్ తో రాబిన్ హుడ్ షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ రాహుక్ సాంకృత్యాన్ కాంబో మూవీ వచ్చే ఏడాది ఉండొచ్చు. ఫణింద్ర నర్సిట్టి దర్శకత్వంలో 8వసంతాలు అనే మూవీ తెరకెక్కుతోంది. టోవినో థామస్ లీడ్ రోల్ నడిగర్ తిలకం అనే పాన్ ఇండియా మూవీ సిద్ధం అవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా హిందీలో ఒక సినిమా చేస్తున్నారు.