Begin typing your search above and press return to search.

కొడ్తే కుంభాన్ని కొట్టాల‌ని ప్లాన్ చేసిన మైత్రి

ఆస‌క్తిక‌రంగా డియోల్ సాబ్ తో మైత్రి మూవీ మేక‌ర్స్ ఓ హిందీ సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉంది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 6:10 AM GMT
కొడ్తే కుంభాన్ని కొట్టాల‌ని ప్లాన్ చేసిన మైత్రి
X

గ‌దర్ 2తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్నారు హిందీ క‌థానాయ‌కుడు స‌న్నీడియోల్. సీక్వెల్ చిత్రంతో బలమైన పునరాగమనాన్ని చాటుకున్నాడు. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 100 చిత్రాల దిశగా దూసుకుపోతున్న ఈ సీనియ‌ర్ నటుడు తన యాంగ్రీ యాక్షన్ హీరో ఇమేజ్‌తో పాపుల‌ర‌య్యాడు. ఆస‌క్తిక‌రంగా డియోల్ సాబ్ తో మైత్రి మూవీ మేక‌ర్స్ ఓ హిందీ సినిమాని ప్రారంభించింది. మైత్రీ మూవీ మేకర్స్ అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, వై రవిశంకర్ ల‌తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిధుల్ని స‌మ‌కూరుస్తున్నారు.


నేడు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. 'మాస్ ఫీస్ట్ లోడింగ్' అనేది ఈ చిత్రానికి క్యాప్షన్. మైత్రి సంస్థ నుంచి స్ట్రెయిట్ హిందీ సినిమా ఇది. ఈ చిత్రానికి తెలుగు డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపిచంద్ మ‌లినేనికి తొలి హిందీ చిత్రమిది. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్ లో హీరో డియోల్‌ని ప్రెజెంట్ చేయనున్నారు.


దక్షిణాది దర్శకులతో బాలీవుడ్ స్టార్ల సినిమాలపై నార్త్ ప్రేక్షకులు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. అదే క్ర‌మంలో లోక‌ల్ ట్యాలెంట్ తో క‌లిసి టాలీవుడ్ బ్యాన‌ర్లు హిందీలోకి దూసుకెళుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెండూ రాజీలేని పద్ధతిలో స్టార్‌లతో అధిక-బడ్జెట్ చిత్రాల‌తో సంచ‌ల‌నాల‌కు తెర తీస్తున్నాయి. ఇరు నిర్మాణ సంస్థలు స‌రైన స్టార్ తో స‌రైన స‌మ‌యంలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. #SDGM చిత్రం గొప్ప సాంకేతిక ప్రమాణాలతో పెద్ద కాన్వాస్‌పై రూపొంద‌నుంది.


ఈరోజు హైదరాబాద్‌లో ప్రత్యేక అతిథుల స‌మక్షంలో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. క్రాక్ - వీరసింహా రెడ్డి వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్‌లను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని అన్ని వాణిజ్య అంశాలతో కూడిన అద్భుత‌మైన స్క్రిప్ట్‌తో #SDGM చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నార‌ని మేక‌ర్స్ తెలిపారు. సయామీ ఖేర్ -రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించ‌నున్నారు. సుప్రసిద్ధ సాంకేతిక నిపుణుల బృందం ప‌ని చేస్తారు. రిషి పంజాబీ కెమెరా వ‌ర్క్ అందించ‌నుండగా, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.