Begin typing your search above and press return to search.

సంక్రాంతికి సలార్ థియేటర్లన్నీ ఆ సినిమాకేనా..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తోన్న మూవీ హనుమాన్

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:25 AM GMT
సంక్రాంతికి సలార్ థియేటర్లన్నీ ఆ సినిమాకేనా..
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తోన్న మూవీ హనుమాన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. జనవరి 12న రిలీజ్ అన్ని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి రేసులోకి హనుమాన్ కి పోటీగా ఏకంగా నాలుగు పెద్ద హీరోల సినిమాలు వచ్చేశాయి.

వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం టాప్ లో ఉంది. వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామి రంగా కూడా రేసులో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమాని వాయిదా వేసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు ప్రశాంత్ వర్మతో పాటు నిర్మాతని అడుగుతున్నారు.

అయితే రిలీజ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేది లేదని ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. నార్త్ ఇండియాలో ఈ రిలీజ్ డేట్ మీదనే మార్కెట్ చేయడం జరిగిందని, ఉన్నపళంగా వాయిదా వేస్తే ఇబ్బంది అవుతుందని స్పష్టం చేశాడు. ఎన్ని సినిమాలు పోటీలో ఉన్న మాకు హనుమాన్ మీద నమ్మకం ఉందని చెప్పారు. అయిన కూడా ఎక్కడో హనుమాన్ వాయిదా పడుతుందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది.

మరోసారి ప్రశాంత్ వర్మ టీమ్ హనుమాన్ రిలీజ్ పై స్పష్టత ఇచ్చారు. జనవరి 12న రాబోతున్నట్లు తెలిపారు. అలాగే ఇంటరెస్టింగ్ అప్డేట్ తో రాబోతున్నాం అని చెప్పారు. ప్రశాంత్ వర్మ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ రైట్స్ ని మైత్రీ నిర్మాతలు కొన్నారు. ప్రస్తుతం సలార్ సినిమాని వారే తెలుగులో రిలీజ్ చేశారు.

దీంతో మెజారిటీ థియేటర్స్ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర ఉన్నాయి. సలార్ ఆడుతున్న థియేటర్స్ లో చాలా వరకు హనుమాన్ కోసం మైత్రీ నిర్మాతలు హోల్డ్ లో పెడుతున్నారని తెలుస్తోంది. నార్త్ లో కూడా మెజారిటీ స్క్రీన్స్ లో హనుమాన్ రిలీజ్ అవుతోంది. బజ్జింగ్ పరంగా చూసుకున్న గుంటూరు కారం తర్వాత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తోన్న సినిమాగా హనుమాన్ మూవీ ఉంది. దీంతో ఈ సినిమా సంక్రాంతి రేసులో వస్తేనే గ్రాండ్ సక్సెస్ అందుకుంటుందని ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నారంట.