Begin typing your search above and press return to search.

మైత్రి వారి ఫోకస్ మామూలుగా లేదు

అజిత్ హీరోగా మార్క్ అంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా చేయనుంది

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:52 AM
మైత్రి వారి ఫోకస్ మామూలుగా లేదు
X

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మినిమమ్ బడ్జెట్ సినిమాలతో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. పుష్ప ది రూల్ మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో మైత్రీ మూవీ మేకర్స్ లో తెరకెక్కుతోంది. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ కూడా మైత్రీలోనే ఉంది. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కనుంది.

ఇలా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని మైత్రీ నిర్మాతలు లైన్ లో పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా ఇతర భాషలలో సినిమా చేయడం కూడా మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే మలయాళంలో టొవినో థామస్ తో ఓ పాన్ ఇండియా మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అలాగే చెన్నైలో కూడా ప్రొడక్షన్ ఆఫీస్ ని రీసెంట్ గా ఓపెన్ చేసారంట.

అజిత్ హీరోగా మార్క్ అంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా చేయనుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంట. అలాగే మీడియం రేంజ్ సినిమాలు కూడా తమిళంలో చేయాలని మైత్రీ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక బాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలు పట్టాలు ఎక్కిస్తున్నారు. నిజానికి ఈ మూవీ రవితేజ హీరోగా చేయాలని అనుకున్నారు. అయితే బడ్జెట్ రవితేజ మార్కెట్ పరిధికి దాటిపోవడంతో బాలీవుడ్ లో అయితే బెటర్ అని సన్నీ డియోల్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా సన్నీ డియోల్ గద్దర్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ ప్రాజెక్ట్ కోసం 130 కోట్ల వరకు మైత్రీ మూవీ మేకర్స్ వారు ఖర్చు చేస్తున్నారంట. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని భాషలలో కూడా మినిమం రేంజ్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేసే దిశగా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ స్పాన్ పెంచుకుంటూ వెళ్తున్నారు.