Begin typing your search above and press return to search.

మైత్రి.. పెద్ద సినిమాలనే పట్టేసింది..

అలాగే ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ మూవీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ లోనే సిద్ధం కాబోతోంది.

By:  Tupaki Desk   |   5 July 2024 3:36 AM GMT
మైత్రి.. పెద్ద సినిమాలనే పట్టేసింది..
X

మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ గా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 ఈ బ్యానర్ లోనే రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీని మైత్రీనే నిర్మిస్తోంది. అలాగే ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ మూవీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ లోనే సిద్ధం కాబోతోంది.

ఇక హిందీలో గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. తమిళంలో అజిత్ హీరోగా పాన్ ఇండియా సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తోనే పాన్ ఇండియా సినిమాలని మైత్రీ డిస్టిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాయి. హనుమాన్ సినిమాతో డిస్టిబ్యూటర్స్ గా మైత్రీ వారికి సాలిడ్ సక్సెస్ ఈ ఏడాది వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కి సంబందించిన నైజాం రైట్స్ ని మైత్రీ డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT. ఈ సినిమా నైజాం రైట్స్ ని మైత్రీ వారు సొంతం చేసుకున్నారంట. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

తెలుగులో కూడా GOAT సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రెడీ అవుతోన్న పాన్ వరల్డ్ మూవీ కంగువ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ మూవీ నైజాం రైట్స్ ని మైత్రీ వారే తీసుకున్నారు. కంగువ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీలో సూర్య డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు.

కంగువ, GOAT సినిమాలు రెండు కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ లతో వస్తున్న మూవీస్ కావడం విశేషం. దీనితో పాటుగా అల్లు శిరీష్ బడ్డీ మూవీ నైజాం రైట్స్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. వీటిలో కచ్చితంగా సౌండ్ చేసే సినిమాలు అంటే కంగువ, GOAT మూవీస్ అని చెప్పాలి. డిస్టిబ్యూటర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ కి మంచి సక్సెస్ లు వస్తున్నాయి. ఈ ఏడాది పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ తో పాటు గా మరో రెండు పాన్ ఇండియా సినిమాలు మైత్రీ బ్యానర్ నుంచి రాబోతున్నాయని స్పష్టం అవుతోంది. వీటిలో ఎన్ని నిర్మాతలకి సక్సెస్ ఇస్తాయనేది వేచి చూడాలి.