Begin typing your search above and press return to search.

మైత్రి చేతిలో డార్లింగ్.. హిట్ కాంబో!

ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా పై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది.

By:  Tupaki Desk   |   11 July 2024 4:04 AM GMT
మైత్రి చేతిలో డార్లింగ్.. హిట్ కాంబో!
X

తెలుగు సినిమా రంగంలో మైత్రి మూవీ మేకర్స్ బ్రాండ్ సక్సెస్ సింబల్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. నిర్మాణంలో ఇప్పటికే బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ప్రముఖ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ లోకి ప్రవేశించిన ఈ సంస్థ, వేరు వేరు రకమైన ప్రాజెక్టుల్ని దక్కించుకుంటూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. "సలార్", "హనుమాన్", "మంజుమ్మెల్ బాయ్స్" వంటి సినిమాలను నైజాంలో విడుదల చేయగా ఘన విజయాన్ని సాధించాయి.


ఇప్పుడు, అదే విజయపరంపరలో మరొక క్రేజీ సినిమా "డార్లింగ్" కూడా చేరనుంది. హనుమాన్ నిర్మాతలు రూపొందించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతోంది. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా పై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో మరియు వినోదాత్మకంగా ఉండడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక డార్లింగ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధమైంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రంలో పలువురు స్టార్స్ సర్ప్రైజ్ కామియోస్ కూడా కిక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ తమ విజయపరంపరను కొనసాగిస్తారనే ఆశతో ఉన్నారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మించారు. డార్లింగ్ చిత్రం జూలై 19న విడుదల కాబోతుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ అనేక విజయవంతమైన చిత్రాలను అందించిన అనుభవంతో, డార్లింగ్ సినిమాకి మంచి ప్రమోషన్స్ నిర్వహించారు.

ఈ సంస్థ తమ సక్సెస్ ఫార్ములాతో పాటు కొత్త రకమైన కథలను ప్రేక్షకుల ముందు తీసుకురావడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా నైజాం రీజన్‌లో మైత్రి మూవీ మేకర్స్ సినిమా విడుదల అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయి. డార్లింగ్ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సభా నటేష్ నటన చాలా డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అలాగే నటుడు ప్రియదర్శి హీరోగా చేసిన ప్రతీ సినిమాతో కూడా మినిమమ్ సక్సెస్ అందుకున్నాడు. బలగం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా చాలా రకాల ఆఫర్స్ వస్తున్నా కూడా ప్రియదర్శి మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక అతను ఇష్టపడి చేసిన డార్లింగ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.