Begin typing your search above and press return to search.

మరో హిట్ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చిన మైత్రీ

ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   20 July 2024 9:30 AM GMT
మరో హిట్ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చిన మైత్రీ
X

ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషాప్రాతిపాదిక మీద కంటే యూనివర్సల్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని కథలని రైటర్ లు, దర్శకులు సిద్ధం చేస్తున్నారు. నిర్మాతలు కూడా ఒకే భాషకి పరిమితం కావాలని అనుకోవడం లేదు. అలాగే స్టార్ హీరోలు కూడా యూనివర్శల్ కథలతో తన మార్కెట్ ని పెంచుకోవాలని అనుకుంటున్నారు. అందుకే అన్ని భాషలలో కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి.

నిర్మాతలు కూడా టాలెంటెడ్ డైరెక్టర్ ఏ భాషలో సక్సెస్ అందుకున్న వెంటనే అతనికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటున్నారు. దర్శకులు కూడా తన కంటెంట్ కి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా లెవల్ లో ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తోంది.

తమిళంలో అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేస్తున్నారు. అలాగే హిందీలో సన్నీ డియోల్ తో మూవీ అవుతోంది. మలయాళంలో కూడా ఓ పాన్ ఇండియా సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్, తారక్ లతో పాన్ ఇండియా మూవీస్ లైన్ అప్ లో పెట్టారు. ఇదే సమయంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ ఇచ్చి మరి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు.

మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం. ఈ దర్శకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నారంట. ప్రస్తుతం చిదంబరం హిందీలో ఫాంటమ్ స్టూడియోస్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందంట. త్వరలో సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రం తర్వాత చిదంబరం మైత్రీ మూవీ మేకర్స్ లో సినిమా చేసే అవకాశం ఉందంట. అలాగే మనసా నమః అనే షార్ట్ ఫిల్మ్ తో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న దీపక్ రెడ్డితో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.