Begin typing your search above and press return to search.

ఆగస్టు 15 మైత్రీ బిగ్ రిస్క్

ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా ఇంచుమించు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలను నిర్మించింది.

By:  Tupaki Desk   |   27 July 2024 5:02 AM GMT
ఆగస్టు 15 మైత్రీ బిగ్ రిస్క్
X

టాలీవుడ్ లో బడా ప్రొడక్షన్ హౌస్ గా దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. శ్రీమంతుడు సినిమాతో మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ వచ్చింది. టాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా ఇంచుమించు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలను నిర్మించింది.

ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ఆల్ ఓవర్ ఇండియాలోనే బిగ్ ప్రొడక్షన్ హౌస్ గా మైత్రీ మూవీ మేకర్స్ తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రయత్నం చేస్తుంది. ఇతర భాషలలో కూడా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి ముందుకొస్తుంది. మరోవైపు నిర్మాతలుగా సక్సెస్ కావడంతో మైత్రి సంస్థ సినిమా డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగుపెట్టింది.

ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఎక్కువ పోటీ పడుతూ ఉంది. ఇప్పటికే నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా టాప్ లో ఉన్నారు. అయితే అతన్నీ బీట్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ మంచి క్రేజ్, బజ్ ఉన్న సినిమాల రిలీజ్ రైట్స్ ని నైజాం ఏరియాలో కొనుగోలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఆగస్టు 15న ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూడు కూడా దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం.

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా నైజాం రిలీజ్ రైట్స్ ని మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకుంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న మిస్టర్ బచ్చన్ నైజాం హక్కులు కూడా వీరి చేతిలోనే ఉన్నాయి. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ తంగలాన్ తెలుగు డబ్బింగ్ రైట్స్ నైజాం పరిధి వరకు మైత్రీ వారే సొంతం చేసుకున్నారు.

ఈ మూడు సినిమాలు పైన కూడా ప్రస్తుతం మంచి బజ్ ఉంది. ఇవి ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. కచ్చితంగా ఈ మూడు కూడా మంచి ప్రేక్షకాధారణ సొంతం చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ టాక్ కాస్త తేడాగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించే రిస్క్ ఉంది. ఈ ఏడాది ఆరంభంలో హనుమాన్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా మైత్రి మేకర్స్ భారీ లాభాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ గా పెద్ద రిస్క్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి లాభాలను అందిస్తాయో చూడాలి.