Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి GOAT మైత్రి చేతికి

ఈ చిత్రం సెప్టెంబర్ 5న నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.

By:  Tupaki Desk   |   8 July 2024 4:45 PM GMT
ద‌ళ‌ప‌తి GOAT మైత్రి చేతికి
X

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ ఇరుగు పొరుగు భాష‌ల్లో మార్కెట్ రేంజును పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఇప్పుడున్న స్టార్స్ లో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కోసం చాలా కాలం క్రిత‌మే ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన త‌మిళ హీరో అత‌డు. త‌దుప‌రి విజ‌య్ న‌టిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ఈ సంవత్సరం భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 5న నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ అవతార్‌లలో కనిపించనున్నాడు.


తాజా స‌మాచారం మేర‌కు.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ 'గోట్' తెలుగు వెర్షన్‌ను ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ అంతటా విడుదల చేయడానికి థియేట్రికల్ హక్కులను పొందింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. కొద్ది రోజుల్లో మరిన్ని ప్రోమోలతో మేకర్స్ రానున్నారు.

GOAT చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, మోహన్, లైలా, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీతం: యువన్ శంకర్ రాజా, రచన & దర్శకత్వం: వెంక‌ట్ ప్రభు.

వ‌రుస‌గా బంప‌ర్ హిట్లు:

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్ర‌స్తుతం వ‌రుస‌ చిత్రాలను నిర్మిస్తోంది. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను కూడా లైన్‌లో ఉంచింది. ప్రొడక్షన్ హౌస్ ఇటీవలి కాలంలో నైజాంలో సలార్, హను-మాన్ వంటి ఇతర నిర్మాణ సంస్థల నుండి అనేక చిత్రాలను విజయవంతంగా పంపిణీ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ ఇక్కడ కూడా బంపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల భాగస్వామిగా మారింది. ఈ క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ ప్రమోషన్లతో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని తెలిపింది.