Begin typing your search above and press return to search.

బిజినెస్ కోసం 'మైత్రి' వదిలేశారా..!?

అమెజాన్‌ మరియు మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఉన్న రిలేషన్‌ చెడిందని, అందుకే పుష్ప 2 ని నెట్‌ ఫ్లిక్స్ కు ఇచ్చారు అని కొందరు ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:30 PM GMT
బిజినెస్ కోసం మైత్రి వదిలేశారా..!?
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కి ఉన్న బజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థియేట్రికల్‌ రైట్స్ తో పాటు శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ హాట్ కేకులు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావించడం సర్వసాధారణం. అందులో నిర్మాతలను తప్పుబట్టాల్సిన పని లేదు.

ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే సినిమాల్లో ఎక్కువ శాతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ చేయడం మనం చూశాం. పుష్ప సినిమా ను కూడా అమెజాన్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌ చేసింది. ఇక పుష్ప 2 ని కూడా అమెజాన్ వారే స్ట్రీమింగ్ చేస్తారు అనుకుంటే మైత్రి వారు నెట్‌ ఫ్లిక్స్ కి అమ్మేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 సినిమాకు నెట్‌ ఫ్లిక్స్ వారు భారీ మొత్తాన్ని కోట్‌ చేయడం తో మైత్రి మూవీ మేకర్స్ వారు అమెజాన్ కి కాకుండా నెట్‌ ఫ్లిక్స్ కి అమ్మేందుకు ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అమెజాన్‌ మరియు మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఉన్న రిలేషన్‌ చెడిందని, అందుకే పుష్ప 2 ని నెట్‌ ఫ్లిక్స్ కు ఇచ్చారు అని కొందరు ప్రచారం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రమే కాకుండా ఏ నిర్మాత అయినా కూడా తమ సినిమాకు ఎక్కువ బిజినెస్ చేసే వారిని కోరుకుంటారు. పుష్ప 2 కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో అమెజాన్ వారి కంటే నెట్ ఫ్లిక్స్ వారు ఎక్కువ ఇస్తానని కోట్‌ చేయడం వల్లే మైత్రి వారు అటు వెళ్లారు తప్ప ఇందులో విభేదాలకు తావు ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దర్శకుడు సుకుమార్‌ దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేశాడు. షూటింగ్‌ కి అంతకు మించి సమయం తీసుకుంటున్నాడు. పుష్ప తో జాతీయ అవార్డ్‌ రావడంతో బన్నీ పై మరింత బాధ్యత పెరిగింది. దాంతో పుష్ప 2 కోసం మరింతగా కష్టపడుతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.