సలార్ కి కలిసొచ్చిన మైత్రీ ప్లానింగ్!
ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' మూవీకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు.
By: Tupaki Desk | 22 Dec 2023 10:25 AM GMTఅగ్ర హీరోలతో భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసినప్పుడు అందుకు తగ్గ ప్రమోషన్స్ చేయాలి. దానికి తోడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాను రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి. అయితే ఈ విషయంలో సలార్ మూవీ టీమ్ కాస్త భిన్నంగా వ్యవహరించింది. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' మూవీకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు.
కానీ సలార్ సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. దాంతో ఈ మూవీ నైజాం ఏరియా రైట్స్ ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ సలార్ కోసం వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ని కేటాయించింది. తమ ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ఉపయోగించి హైదరాబాద్ తో పాటు నైజాం ఏరియాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు స్పెషల్ షోలకు ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకున్నారు.
దాంతో సలార్ మూవీకి అదనపు షోలు దక్కడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ ని నమోదు చేయనుంది. ఆ విధంగా మైత్రి మూవీ మేకర్స్ ప్లానింగ్ సలార్ కి చాలా పెద్ద హెల్ప్ అయిందనే చెప్పాలి. ఈరోజు వరకు అన్ని షోలకు సంబంధించిన టికెట్స్ అమ్ముడయిపోయాయి. ఈ వీకెండ్ మొత్తం సలార్ మూవీకి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
దాంతో తెలుగు రాష్ట్రాల్లో సలార్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ మూవీకి బిగ్ నంబర్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. అదే జరిగితే సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక సలార్ విషయానికి వస్తే.. నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడని, డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లను చాలా బాగా డిజైన్ చేయడం, దానికి సినిమాటోగ్రఫీ తోడవడంతో ఆడియన్స్ ఈ సినిమాకి మంచి ఆదరణ కనబరుస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్లో హోంబలే ఫిలిమ్స్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ మూవీ 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.