Begin typing your search above and press return to search.

నానా హైరానా... ఇలాంటివి ఎన్నో?

సంక్రాంతికి వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అతి తక్కువ వసూళ్లకే థియేటర్ల నుంచి కనిపించకుండా పోయింది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 9:40 AM GMT
నానా హైరానా... ఇలాంటివి ఎన్నో?
X

సంక్రాంతికి వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అతి తక్కువ వసూళ్లకే థియేటర్ల నుంచి కనిపించకుండా పోయింది. సంక్రాంతికి వస్తున్నాం జోరు ముందు గేమ్‌ ఛేంజర్‌ నిలవలేక పోయాడు. కథలో బలం ఉన్నా దాన్ని చూపించలేక దర్శకుడు చేతులు ఎత్తేశాడు. సినిమా మొత్తం కట్‌ కాపీ పేస్ట్‌ అన్నట్లుగా ఉందని, అతుకుల బొంత మాదిరిగా సినిమా ఉందనే విమర్శలు వచ్చాయి. కొన్ని పాత్రలను ఎందుకు చూపించారో అర్థం కాలేదు, కొన్ని పాత్రలను ఎక్కడ ఎండ్‌ చేశాడో అర్థం కాలేదు. సినిమా మొత్తం నిడివి 5 గంటలు వచ్చిందని, దాన్ని కట్‌ చేసే క్రమంలో ఇలా వచ్చిందని శంకర్‌ ఓపెన్‌గానే చెప్పారు.

గేమ్‌ ఛేంజర్‌లోని కట్‌ చేసిన సన్నివేశాల సంగతి పక్కన పెడితే షూటింగ్ పూర్తి చేసి విడుదలకు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నానా హైరానా పాటను పెట్టక పోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నానా హైరానా పాటకి మంచి స్పందన వచ్చింది. సినిమాలోని బెస్ట్‌ మెలోడీ అంటూ తమన్‌ సైతం చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నానా హైరానా పాటకి ఇప్పటివరకు ఎప్పుడూ వాడని సరికొత్త టెక్నాలజీని వాడటంతో పాటు అద్భుతమైన విజువల్స్‌ ఉన్న చోట షూట్‌ చేశామని అన్నారు. థియేటర్‌లో పాటను చూస్తే కచ్చితంగా కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటుంది అని యూనిట్‌ సభ్యులు మరీ మరీ చెప్పారు.

తీరా చూస్తే సినిమాలో పాటకు ఛాన్స్ లేదని తొలగించారు. ఎక్కడ పెట్టినా స్క్రీన్‌ప్లే డిస్ట్రబ్‌ అవుతుందని తొలగించినట్లుగా యూనిట్‌ సభ్యులు చెప్పారు. విడుదలై కొన్ని రోజుల తర్వాత తీసుకు వస్తామని అన్నారు. పాటను యాడ్‌ చేశారా లేదా అనేది కూడా చాలా మందికి తెలియదు. సినిమాలో పాటను యాడ్‌ అయితే చేశారు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సినిమా విడుదలైన తర్వాత హైరానా పాట గురించి ఏ ఒక్కరూ పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్‌లో ఆ పాటను మిస్ అయ్యాం అని మొదటి రెండు రోజులు ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు కానీ మొత్తంగా సినిమా పోవడంతో పాట గురించి పెద్దగా చర్చ జరగలేదు.

ఇన్ని రోజుల తర్వాత గేమ్‌ ఛేంజర్ సినిమా నుంచి నానా హైరానా పాటను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన పూర్తి వీడియో సాంగ్‌ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బుల్లి తెరపై చూస్తేనే అద్భుతంగా ఉన్న ఈ పాటను వెండి తెరపై చూసి ఉంటే ఇంకా బాగుండేది కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఒక అద్భుతమైన పాటను అత్యంత ఖరీదైన పాటను సునాయాసంగా తీసి వేసిన మేకర్స్‌ ఇంకా ఎన్ని సన్నివేశాలను తొలగించి ఉంటుందో కదా అంటున్నారు. సినిమా బడ్జెట్‌లో కనీసం 25 నుంచి 30 శాతం ఎడిటింగ్‌లో తొలగించిన ఫుటేజ్‌కి పెట్టి ఉంటారు కదా అనే కొత్త చర్చ మొదలైంది.

నానా హైరానాతో పాటు ఎంతో ఖర్చు చేసి రూపొందించిన సన్నివేశాలను, కీలక నటీనటులపై తీసిన సన్నివేశాలను ఫైనల్‌ కట్ లో లేకపోవడం కచ్చితంగా పెద్ద నష్టం. త్వరలో ఓటీటీ ద్వారా రాబోతున్న ఈ సినిమాను కనీసం మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు నిడివి ఉండేలా స్ట్రీమింగ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అప్పుడు అయినా సినిమా బాగుంటుందేమో అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.