Begin typing your search above and press return to search.

ఐదేళ్ల క్రితం నాటి ప్ర‌క‌ట‌నకి ఇప్ప‌టికి మోక్షం!

దీనిలో భాగంగా ఐదేళ్ల క్రితం ప్ర‌క‌టించిన `నాగిన్` ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:37 AM GMT
ఐదేళ్ల క్రితం నాటి ప్ర‌క‌ట‌నకి ఇప్ప‌టికి మోక్షం!
X

ఇటీవ‌లే బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్ `స్త్రీ-2` తో మ‌రో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేస‌కున్న సంగ‌తి తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి 2024 ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. ఈ విజ‌యంతో శ్ర‌ద్దా క‌పూర్ స్టార్ డ‌మ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. దీంతో ఆగిపోయిన సినిమాల్ని సైతం మేక‌ర్స్ ప‌ట్టాలెక్కించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఐదేళ్ల క్రితం ప్ర‌క‌టించిన `నాగిన్` ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు.

శ్ర‌ద్దా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విశాల్ ప్యూరియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు 5 ఏళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కానీ ఎందుక‌నో సినిమాని ప‌ట్టాలెక్కించ‌లేదు. ప్ర‌క‌టించిన త‌ర్వాత ఇద్ద‌రు వేర్వేరు సినిమాలు చేసారు త‌ప్ప‌! నాగిన్ ప్రాజెక్ట్ ని మాత్రం ప‌ట్టాలెక్కించ‌లేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని నిర్మాత నిఖిల్ ద్వివేది కూడా తెలిపారు. షూటింగ్ కోసం టీమ్ అంతా రెడీ అవుతున్న‌ట్లు పేర్కొన్నారు. నాగిన్ అనేది ఓ ప్రేమ క‌థ‌. ప్రేమ‌, త్యాగాల‌కు సంబంధించిన ఓ గొప్ప క‌థ‌. మ‌రికొద్ది రోజుల్లోనే సెట్స్ కు వెళ్తుంది` అని స్ప‌ష్టం చేసారు.

మొత్తానికి ఐదేళ్ల త‌ర్వాత `నాగిన్` కి మోక్షం క‌లగడం విశేషం. శ్ర‌ద్దా క‌పూర్ స్టార్ డ‌మ్ రెట్టింపు అవ్వ‌డంతోనే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ ఛాన్స్ తీసుకుంటున్నారు. లేదంటే? ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉండేదా? కాదా? అని కొంద‌రు భావిస్తున్నారు. అలాగే ఈసినిమా కోసం శ్రద్దా క‌పూర్ భారీగానే పారితోషికం తీసుకుంటుందిట‌. ఆమె స్టార్ డమ్ ఆధారంగా కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తుందిట‌.

అయితే ఈ క‌థ‌లో ఏమైనా మార్పులు చేసారా? లేక ఐదేళ్ల క్రితం రాసిన క‌థ‌నే య‌ధావిధిగా తీసేస్తున్నారా? అన్న‌ది తెలియాలి. మ‌రి స్త్రీ లో దెయ్యం పాత్ర‌లో అల‌రించిన క‌పూర్ బ్యూటీ, నాగిన్ లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం శ్ర‌ద్దా క‌పూర్ ఏ కొత్త ప్రాజెక్ట్ ల‌కు కూడా సైన్ చేయ‌లేదు. నాగిన్ పూర్తి చేసిన త‌ర్వాతే కొత్త ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంటుంది.