Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు 18 ఏళ్ల‌కు రిలీజ్ మోక్షం!

అజయ్ దేవ‌గ‌ణ్ హీరోగా అనీస్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `నామ్` న‌వంబ‌ర్ 22న రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 3:30 PM GMT
ఆ సినిమాకు 18 ఏళ్ల‌కు రిలీజ్ మోక్షం!
X

అజ‌య్ దేవ‌గ‌ణ్ `సింగం ఎగైన్` లోడింగ్ లో ఉంది. న‌వంబ‌ర్ 1న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. ప్ర‌స్తుతం అజ‌య్ అండ్ కో అంతా ఆ సినిమా ప్ర‌చారం ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. ఈనేప‌థ్యంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. సింగం ఎగైన్ స‌క్సెస్ ని కంటున్యూ చేసేలో మ‌రోరిలీజ్ తో కూడా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌. అయితే ఆసినిమా రిలీజ్ కి 18 ఏళ్లు ప‌ట్టింది అన్న‌ది అంతా గ్ర‌హించాల్సిన వాస్త‌వం. అజయ్ దేవ‌గ‌ణ్ హీరోగా అనీస్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `నామ్` న‌వంబ‌ర్ 22న రిలీజ్ అవుతుంది.


వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్ అవుతోన్న నాల్గ‌వ చిత్ర‌మిది. గ‌తంలో వీరిద్ద‌రు 'హల్చుల్', 'ప్యార్ తో హోనా హి థా' మరియు 'దీవాంగి' వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. దీంతో ఈ కాంబినేష‌న్ అంటే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలో 18 ఏళ్ల క్రితం నామ్ సినిమాకి సంక‌ల్పించారు. ఈ సినిమా షూటింగ్ 2004 నుంచి 2006 మధ్యలో పూర్తయింద. కానీ ఆ తర్వాత అనేక కారణాల వల్ల విడుదల కాలేదు. నిర్మాత‌ల్లో ఒక‌రు కూడా మ‌ర‌ణిచ‌డంతో అప్ప‌ట్లో వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత ఈ సినిమా రిలీజ్ మ‌రుగున ప‌డింది.

ప‌ట్టించుకునే నాదుడే లేక‌పోయాడు.ఈ నేప‌థ్యంలో తాజాగా నవంబర్ 22న ఇండియాలోనే కాకుండా వ‌ర‌ల్డ్ లోనే రిలీజ్ అవుతుంది. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం. జ్ఞాపకశక్తిని కోల్పోయి, తన గుర్తింపును వెతుక్కునే ప్రయా ణాన్ని ప్రారంభించిన వ్యక్తి చుట్టూ `నామ్` కథ తిరుగుతుంది. స్విట్జర్లాండ్ , ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రాన్ని అనిల్ రుంగ్తా , రుంగ్తా ఎంటర్‌టైన్‌మెంట్ - స్నిగ్ధ మూవీస్ నిర్మించాయి. పెన్ మరుధర్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు.

ఇందులో తొలుత హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎంపికైంది. షూటింగ్ కూడా చేసింది. ఆ త‌ర్వాత మ‌ధ్య‌లో ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవ‌డంతో ఆ స్థానంలో స‌మీరా రెడ్డిని తీసుకున్నారు. ఇదే సినిమాలో భూమిక చావ్లా కూడా ఓ కీలక పాత్ర పోషించింది.

ఇదిలా ఉండగా, దర్శకుడు అనీస్ బజ్మీ తన తదుపరి చిత్రం 'భూల్ భూలయ్యా 3' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు, ఇందులో కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రీ, విద్యాబాలన్ మరియు మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం ఆసక్తికరంగా అజయ్ దేవగన్ 'సింగం ఎగైన్'తో ఢీకొంటుంది.