Begin typing your search above and press return to search.

నా సామీ రంగ బాక్సాఫీస్.. 7 రోజుల లెక్క

నాగార్జున నమ్మకం బలంగా పనిచేసింది. దీంతో మూవీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఏడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 20.54 కోట్లు షేర్ తో హిట్ బొమ్మగా మారింది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 5:22 AM GMT
నా సామీ రంగ బాక్సాఫీస్.. 7 రోజుల లెక్క
X

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన నా సామీ రంగా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలతో పోటీ పడుతూ థియేటర్స్ లోకి వచ్చింది. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి కొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు తరహాలోనే సంక్రాంతి రేసులో హనుమాన్ తర్వాత మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. గుంటూరు కారం సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోలేదని తెలుస్తోంది. అలాగే సైంధవ్ మూవీ డిజాస్టర్ అయ్యింది. హనుమాన్ అయితే మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాట పట్టింది. దీంతో సంక్రాంతి సినిమాలలో నెంబర్ వన్ 1 హనుమాన్ నిలిచింది.

ఇక నా సామి రంగా మూవీ కూడా ఏడురోజుల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇకపై మూవీకి కలెక్షన్స్ అన్ని కూడా లాభాలుగానే ఉంటాయి. నాగార్జున కెరియర్ లోనే అత్యంత వేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాగే కంటెంట్ విషయంలో కూడా ఎలాంటి డౌట్ లేకుండా కాన్ఫిడెంట్ తో సంక్రాంతి రేసులో నిలిపారు.

నాగార్జున నమ్మకం బలంగా పనిచేసింది. దీంతో మూవీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఏడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 20.54 కోట్లు షేర్ తో హిట్ బొమ్మగా మారింది.

ఈ సినిమాకి ఏడో రోజు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన షేర్ కలెక్షన్స్ చూసుకుంటే

నైజాం - 21L

సీడెడ్ - 20L

వైజాగ్ -23L

తూర్పు గోదావరి - 16L

పశ్చిమ గోదావరి - 9L

కృష్ణా - 8L

గుంటూరు - 9L

నెల్లూరు - 5L

7వ రోజు టోటల్ కలెక్షన్స్ షేర్ - 1.11 కోట్లు

7 రోజుల టోటల్ ఏపీ తెలంగాణ షేర్ - 20.54 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 41.3 కోట్లు