Begin typing your search above and press return to search.

నా సామీ రంగ 5 రోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

కింగ్ నాగార్జున సంక్రాంతి సందర్భంగా నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:46 AM GMT
నా సామీ రంగ 5 రోజుల కలెక్షన్స్.. ఎంతంటే..
X

కింగ్ నాగార్జున సంక్రాంతి సందర్భంగా నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. హనుమాన్ తర్వాత సెకండ్ సంక్రాంతి విన్నర్ గా ఈ చిత్రం నిలిచేలా కనిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఎక్కువ మంది ఆదరిస్తున్నారు.

ఇదిలా ఉంటే బంగార్రాజు తర్వాత కింగ్ నాగార్జున సాలిడ్ సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అక్కినేని యువ హీరోలకి కూడా హిట్ పడలేదు. ఇలాంటి సమయంలో నా సామి రంగా సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడింది. సైంధవ్ మూవీకి డివైడ్ టాక్ రావడం, గుంటూరు కారం సినిమా మిక్సడ్ టాక్ తో నడవడంతో నా సామిరంగా సినిమాకి ప్రేక్షకాదరణ పెరిగింది.

ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 35.4 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి 18.17 కోట్ల షేర్ రావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదో రోజు 2. 54 కోట్ల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. అలాగే విశాఖ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, గుంటూరు, సీడెడ్ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఓవరాల్ కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

5వ రోజు నా సామి రంగా ఏపీ తెలంగాణ కలెక్షన్స్

నైజాం - 61L

సీడెడ్ - 44L

వైజాగ్ -41L

ఈస్ట్ గోదావరి - 34L

వెస్ట్ గోదావరి - 17L

కృష్ణా -19L

గుంటూరు - 24L

నెల్లూరు - 14L

5వ రోజు తెలుగు రాష్ట్రాలలో షేర్ - 2.54 కోట్లు

5 రోజుల టోటల్ తెలంగాణ ఏపీ షేర్ - 18.17 కోట్లు

వరల్డ్ వైడ్ 5 రోజుల కలెక్షన్స్ - 35.4 కోట్లు

ఈ చిత్రంతో కింగ్ నాగార్జునకి మాత్రమే కాకుండా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఖాతాలో కూడా నా సామిరంగా హిట్ బొమ్మగా నిలిచింది. రాజ్ తరుణ్ చాలా కాలం నుంచి వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్నాడు. నా సామిరంగా సినిమాతో మరల ఈ యువ హీరో కెరియర్ గాడిలో పడే అవకాశం కనిపిస్తోంది.