మాస్ లుక్ లో నా సామిరంగ అనిపిస్తున్న నాగ్..!
టాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒకరు. గత కొంతకాలంగా ఆయన సినిమాలన్నీ దెబ్బ పడుతున్నాయి. నాగ్ సరైన హిట్ చూసి చాలా కాలమే అవుతుంది
By: Tupaki Desk | 18 Sep 2023 10:16 AMటాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒకరు. గత కొంతకాలంగా ఆయన సినిమాలన్నీ దెబ్బ పడుతున్నాయి. నాగ్ సరైన హిట్ చూసి చాలా కాలమే అవుతుంది. వరస ఫెయిల్యూర్ లతో బాధపడుతున్న ఆయన ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆయన తన కొత్త సినిమా నా సామిరంగ ను ప్రకటించారు. నాగ్ చూడటానికి చాలా క్లాస్ గా ఉంటారు. కానీ, మాస్ రోల్స్ కూడా అదరగొట్టేయగలరు.
అందుకే, ఈ సారి ఆయన తనకు కరెక్ట్ గా సూటయ్యే మాస్ రోల్ ఉండే సినిమాను ఎంచుకున్నారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. అది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గ్లింప్స్ చూసిన తర్వాత మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే అక్కినేని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి తాజాగా నాగ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కూడా ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో నాగ్ పంచకట్టులో మెరిశారు. చేతిలో బీడీ కాలుస్తూ, మరో చేతితో పంచ పట్టుకున్నారు. ఆయన పక్కనే ఓ కారు ఉంది. దాని మీద కింగ్ అని రాసి ఉంది. అదేవిధంగా కారుపై రక్తం మరకలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి.
ఇక, నాగ్ వెనక కొందరు డప్పులు వాయిస్తూ కనపడుతుండటం విశేషం. ఇక, పోస్టర్ తో మూవీ టీమ్ మరో అప్ డేట్ కూడా ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే, 2024లో సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ సంభాషణలు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. మరి, ఈ మూవీ నాగ్ కెరీర్ కి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.