Begin typing your search above and press return to search.

నా సామిరంగ సైలెన్స్ వెనుక రీజన్ అదేన..?

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ కూడా ఉన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:19 PM GMT
నా సామిరంగ సైలెన్స్ వెనుక రీజన్ అదేన..?
X

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ కూడా ఉన్న విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై బజ్ పెంచాయి. నాగార్జున సరసన ఆషికి రంగనాథ్ హీరోయిన్ గా నటించగా సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ సినిమా రీమేక్ గా నా సామిరంగ వస్తుంది. ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథనం మార్చినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కథ కథనాల విషయంలో కింగ్ నాగార్జున హ్యాండ్ కూడా పడిందని టాక్. అయితే నా సామిరంగ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి సినిమాపై డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అది కూడా బాగా వర్క్ అవుట్ అవుతుంది. నాగార్జున సినిమా సంక్రాంతికి రావడం అదో హిట్ సెంటిమెంట్ అని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు. సో నా సామిరంగ సినిమా కూడా పొంగల్ కి వచ్చి సూపర్ హిట్ అందుకుంటుందని నమ్ముతున్నారు.

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ప్రమోషన్స్ మొదలు పెట్టి హడావిడి చేస్తుంటే ఇంకా నాగార్జున మాత్రం మొదలు పెట్టలేదు. నాగార్జున సైలెన్స్ వెనుక రీజన్స్ ఏంటని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే సినిమా గురించి ఎక్కువ హైప్ పెంచి ఆ తర్వాత ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వడం కన్నా సినిమాపై తక్కువ అంచనాలతో వచ్చేలా నా సామిరంగ టీం ప్లాన్ చేస్తుంది. అందుకే సంక్రాంతి కానుకగా జనవరి 14న వస్తున్నా సరే నాగార్జున ఇంటర్వ్యూ ఒక్కటి బయటకు రాలేదు.

నా సామిరంగ సినిమా సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ కి సరిపోయే సినిమా అని చిత్ర యూనిట్ చెబుతుంది. పోటీగా మూడు సినిమాలు వస్తున్నా నా సామిరంగ టీం మాత్రం వారి సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు. భారీ హైప్ తో.. అంతకుమించిన అంచనాలతో వస్తే అది అందుకోలేక సినిమాలు విఫలమవుతున్నాయి. అయితే సైలెంట్ గా వచ్చి నా సామిరంగ హిట్ టార్గెట్ పెట్టుకుందని తెలుస్తుంది. నా సామిరంగ ప్రమోషన్స్ లో నాగార్జున మాస్టర్ ప్లాన్ ఎంత వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే అక్కినేని ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహం రెట్టింపు అవుతుంది.