Begin typing your search above and press return to search.

నా సామి రంగా కలెక్షన్స్.. 3వ రోజు కూడా అదే జోరు

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం నా సామి రంగా

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:45 AM GMT
నా సామి రంగా కలెక్షన్స్.. 3వ రోజు కూడా అదే జోరు
X

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం నా సామి రంగా. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకి బ్యాక్ టాక్ రావడంతో ఆడియన్స్ హనుమాన్ తర్వాత నా సామి రంగా చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో మూవీకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. నాగార్జున చివరిగా ఘోస్ట్ మూవీతో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ సారి పక్కా లెక్కలతో మలయాళీ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ మూవీలో కీలక పాత్రలలో నటించారు. ఆషికా రంగనాథ్ ఈ మూవీలో నాగార్జునకి జోడీగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. ఆమె పాత్రకి మంచి గుర్తింపు లభించింది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నా సామి రంగా మూవీ కనెక్ట్ కావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

దొరికినవి తక్కువ థియేటర్స్ అయిన సందడి మాత్రం గట్టిగానే ఉంది. ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఈ సినిమా 24.08 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా అందులో 12.46 కోట్ల షేర్ ఉండటం విశేషం. మూడో రోజు ఈ మూవీ ఏకంగా 3.58 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇదే జోరు ఈ వారాంతం వరకు కొనసాగితే నా సామి రంగా బ్రేక్ ఈవెన్ రావడంతో పాటు సాలిడ్ సక్సెస్ దిశగా అడుగులు వేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

నాగార్జున కెరియర్ లో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు తరహాలోనే నా సామి రంగా మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా రావడం. అలాగే కోస్తా జిల్లాల్లో జరిగే ప్రభల తీర్ధం ఈ చిత్రంలో హైలైట్ ఎపిసోడ్ గా ఉండటం సంక్రాంతికి ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయిపొయింది. ఈ కారణంగానే థియేటర్స్ లో కలెక్షన్స్ సాలిడ్ గా వస్తున్నాయి.

ఇక మూడో రోజు ఈ సినిమాకి ఏరియా వారీగా వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే

నైజాం - 1.05 కోట్లు

సీడెడ్ - 60 లక్షలు

వైజాగ్ - 51 లక్షలు

తూర్పు గోదావరి - 44 లక్షలు

పశ్చిమ గోదావరి - 22 లక్షలు

కృష్ణా - 24 లక్షలు

గుంటూరు - 34 లక్షలు

నెల్లూరు - 18 లక్షలు

టోటల్ మూడో రోజు కలెక్షన్స్ - 3.58 కోట్లు

మొత్తం 3 రోజుల షేర్ - 12.46C

మొత్తం 3 రోజుల WW గ్రాస్ - 24.8C