ఈసారి పండక్కి కిష్టయ్య గట్టిగా కొడుతున్నాడు: నాగార్జున
కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది
By: Tupaki Desk | 10 Jan 2024 5:39 PM GMTకింగ్ నాగార్జున నటించిన నా సామి రంగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. నేటి సాయంత్రం ప్రీరిలీజ్ వేదికపై కింగ్ నాగార్జున మాట్లాడుతూ సంక్రాంతి విజయాలు ఎప్పుడూ తన ఖాతాలో ఉన్నాయని ధీమాని వ్యక్తం చేసారు. రెండు పండుగలు చూసాను.. విజయాలిచ్చారు.. మూడో పండగకు గట్టిగా కొడుతున్నాం అని అన్నారు. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ విన్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. అన్నారు.
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి ప్రత్యేకత ఏమిటో కూడా నాగార్జున తనదైన శైలిలో వెల్లడించారు. సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం మనకు ఆనవాయితీ. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాలొచ్చినా మన తెలుగు ఆడియెన్ చూస్తారు. తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలొస్తున్నాయి. ప్రతిదీ విజయం సాధిస్తాయి. సినీపరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు 'గుంటూరు కారం'కి ఆల్ ది బెస్ట్. బాల నటుడిగా చూసాను తేజను. ఇప్పుడు ఒక హీరో అయ్యి 'హను-మ్యాన్' అనే సినిమాతో వస్తున్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని `సైంధవ్` అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు 'నా సామిరంగా'తో మేం మీ ముందుకు వస్తున్నాం. మేం మంచి సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో వరుసగా రెండు పండుగలకు చూసాను. ఈ పండక్కి కూడా సినిమా నచ్చుతుంది. ఎప్పటిలాగే ఆదరిస్తారని నమ్మకం.
నా సినిమాకి స్టార్ ఎవరు? అంటే ఎం.ఎం.కీరవాణి గారు. ఆయన ఇచ్చిన పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే మూడు పాటలు రిలీజ్ చేసాం. ఇవన్నీ దూసుకెళుతున్నాయి. మేమంతా ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేయగలిగామంటే కీరవాణి మా వెనక ఉండి ముందుకు నడిపించారు కాబట్టి. సినిమా ప్రారంభానికి ముందే మూడు పాటలు రెడీ చేసి మా ముందు ఉంచారు. తొలి ఫైట్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేం ఫైట్ తీయక ముందే చేసి పెట్టారు. కీరవాణి లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు ఏదైనా సాధిస్తాం. విజయ్ బిన్ని లాంటి కొత్త డైరెక్టర్ ని కీరవాణి, చంద్రబోస్ వెంట ఉండి ఎంకరేజ్ చేసారు. ఈ కష్టం ఫలించిందా లేదా? అన్నది జనవరి 14న తెలుస్తుంది. అంతవరకూ వేచి చూద్దాం.
సెప్టెంబర్ 23 నాన్న గారి పుట్టినరోజున... ఆయనకు 100 ఏళ్లు వచ్చిన రోజున.. సెప్టెంబర్ 20న ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు.. నువ్వు వెళ్లి చేయరా సినిమా.. `నా సామి రంగా` అని అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇది ఇలా పూర్తి చేసాం. ఈసారి పండక్కి కొడుతున్నాం.. అని నాగార్జున అన్నారు. 3 నెలల్లో ఒక సినిమా ఎలా తీయొచ్చో పుస్తకం రాసిస్తామని కూడా నాగార్జున వెల్లించారు. సక్సెస్ మీట్ లో నిర్మాతలు టెక్నీషియన్ల గురించి మాట్లాడతానని అన్నారు.