Begin typing your search above and press return to search.

దుమ్ము దుకాణం: కింగ్ మార్క్ మాసిజం ఎన‌ర్జీ

మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీరవాణి సంగీతం ప‌వ‌రేంటో మ‌రోసారి నిరూప‌ణ అయింది. తాజాగా రిలీజైన `నా సామి రంగా` పాట‌లు వెబ్ లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jan 2024 3:37 AM GMT
దుమ్ము దుకాణం: కింగ్ మార్క్ మాసిజం ఎన‌ర్జీ
X

మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీరవాణి సంగీతం ప‌వ‌రేంటో మ‌రోసారి నిరూప‌ణ అయింది. తాజాగా రిలీజైన `నా సామి రంగా` పాట‌లు వెబ్ లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి. తాజాగా రిలీజైన దుమ్ము దుకాణం అంత‌ర్జాలాన్ని ఓ ఊపు ఊపుతోంది. సంక్రాంతి వాతావ‌ర‌ణానికి ప‌ర్ఫెక్ట్ సింబాలిక్ గా విజువ‌లైజ్ చేసిన ఈ పాట ఆడియో వీడియో అద్బుతంగా అల‌రిస్తున్నాయి. ఈ సంక్రాంతికి ప‌ర్ఫెక్ట్ మాస్ యాక్ష‌న్ రొమాంటిక్ సినిమా నా సామి రంగా అని ఇప్ప‌టికే విడుద‌లైన విజువ‌ల్స్ వెల్ల‌డిస్తున్నాయి. సెల‌బ్రిటీ యాంథెమ్ ఆఫ్ ది ఇయ‌ర్ పేరుతో విడుద‌ల చేసిన దుమ్ము దుకాణం సాంగ్ లో కింగ్ నాగార్జున‌, అల్ల‌రి న‌రేష్, రాజ్ త‌రుణ్ స‌హా అందాల క‌థానాయిక‌లు నిజంగానే దుమ్ము రేపారు. నాగ్ ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు, న‌రేష్ స్పీడ్ డ్యాన్స్ ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకోగా, ప్ర‌తి ఫ్రేమ్ లో అందాల క‌థానాయిక‌ల గ్లామ‌ర్ చీర‌లో హొయ‌లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఇది ప‌ర్ఫెక్ట్ సంక్రాంతి ఫిలిం అన్న భ‌రోసాని ఇస్తున్నాయి ఈ పాట‌లు.

నాగార్జున అక్కినేని క‌థానాయ‌కుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో వస్తున్న `నా సామి రంగ` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుండ‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జంగ్లీ మ్యూజిక్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో సంచలనం సృష్టించింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ మూమెంట్స్ , ఎన‌ర్జిటిక్ పాట‌లు హైలైట్ గా క‌నిపించే ట్రైలర్ ఇప్పటికే 6.7 మిలియన్లకు పైగా వీక్షణలను అందుకుంది.

దుమ్ము దుకాణం పాట‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి స్వరపరచగా ప్రసన్న కుమార్ బెజవాడ పాడారు. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 8 జనవరి 2024న విడుదలైన ప్రమోషనల్ సాంగ్ వీడియో క్లిప్ యూట్యూబ్‌లో 2,68,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. నెటిజ‌నులు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సెల‌బ్రేట్ చేసుకున్నారు. సంక్రాంతి పండ‌క్కి ఇది చాలా ప్ర‌త్యేక‌మైన సినిమా అని ప్రూవ్ అవుతుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

`నా సామి రంగ` అనేది పీరియడ్ యాక్షన్-డ్రామా.. తారాగణంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ ధిల్లాన్ తదితరులు ఉన్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్‌ : ఛోటా కె ప్రసాద్‌. ఈ చిత్రం వాస్తవానికి 2019లో విడుదలైన మలయాళ చిత్రం పొరింజు మరియం జోస్‌కి అధికారిక రీమేక్.

బాక్సాఫీస్ పోటీలో మ‌రో మూడు సినిమాలు ఉన్నప్పటికీ నాగార్జున తన సంక్రాంతి రిలీజ్ విషయంలో ఆశాజనకంగానే ఉన్నాడు. ది ఘోస్ట్, బంగార్రాజు త‌ర్వాత నాగ్ చాలా జాగ్ర‌త్త‌గా స‌మ‌యం తీసుకుని రూపొందించిన చిత్ర‌మిది. త‌దుప‌రి నాగార్జున D51 .. మోహన్ రాజా దర్శకత్వం వహించ‌నున్న టైటిల్ లేని చిత్రం సెట్స్ లో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ల నిర్దిష్ట విడుదల తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.