లండన్ వీధుల్లో 'నాటు నాటు' .. స్టెప్పులేసిన మహిళలు!
మహిళలంతా చీరలు ధరించి ఆర్.ఆర్.ఆర్. సాంగ్ కు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 8 Aug 2023 4:02 AM GMTఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్. సినిమా గురించి మాగ్జిమం ఎవరికీ పరిచయం అవసరం లేదని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో నాటు.. నాటు.. సాంగ్ సృష్టించిన చరిత్ర గురించి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా లండన్ వీదుల్లో ఈ పాట మరోసారి సందడి చేసింది.
అవును... ట్రిపుల్ ఆర్ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక నాటునాటు సాంగ్ సంగతి సరే సారి. ఈసాంగ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్ లో ఊపేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాటునాటు పాటకు లండన్ లో డ్యాన్స్ చేశారు. సుమారు 700 మంది లండన్ వీధుల్లో స్టెప్పులేస్తూ సందడి చేశారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా... చీరలు ధరించిన మహిళలు లండన్ వీధుల్లో దుమ్ములేపారు. లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల నాటు నాటు స్టెప్పులతో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు.
మహిళలంతా చీరలు ధరించి ఆర్.ఆర్.ఆర్. సాంగ్ కు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా... ఆర్.ఆర్.ఆర్. మూవీ - నాటు నాటు సాంగ్... ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ ను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.