Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌-తార‌క్ వేగాన్ని ఆ ఇద్ద‌రు ట్రై చేసారా?

మ‌రి అలాంటి పాట‌ని రీక్రియేట్ చేయాలంటే? ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం మాలో ఉందంటూ టైగ‌ర్ ష్రాప్- అక్ష‌య్ కుమార్ ముందుకొచ్చారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:56 AM GMT
చ‌ర‌ణ్‌-తార‌క్ వేగాన్ని ఆ ఇద్ద‌రు ట్రై చేసారా?
X

ప్ర‌పంచాన్ని షేక్ చేసిన' నాటు నాటు' స్టెప్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ జోడీ ఏకంగా వ‌ర‌ల్డ్ నే ఆ పాట‌తో ర‌ప్ఫాడించేసారు. ఆస్కార్ అవార్డుతో గొప్ప గౌర‌వాన్ని భార‌త్ కి తీసుకొచ్చారు. అంత‌కు ముందు ఆ స్టెప్ అందుకోని అభిమాని అంటూ లేడు. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయిన స్టెప్ అది. కోట్లాది మందితో కాలు క‌దిపించిన స్టెప్ అది. వేదిక‌ల‌పై హీరోయిన్లు సైతం ద‌ద్ద‌రిల్చించిన సాంగ్ అది.

మ‌రి అలాంటి పాట‌ని రీక్రియేట్ చేయాలంటే? ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం మాలో ఉందంటూ టైగ‌ర్ ష్రాప్- అక్ష‌య్ కుమార్ ముందుకొచ్చారు. ఇద్ద‌రు క‌లిసి 'బడే మియాన్ చోటే మియాన్' అనే చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి ఏమంత ఊపు తీసుకు రాలేదు. అభిమానుల్ని టీజ‌ర్ ద‌గ్గ‌రే నిరాశ‌ప‌రిచినట్లు క‌నిపిస్తోంది. తాజాగా 'మస్త్ మలాంగ్ ఝూమ్' అనే ఓ కొత్త పాటను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న స్టెప్ కూడా లీక్ చేసారు.

ప్రివ్యూలో అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ చేయడం చూడొచ్చు. అయితే ఆ స్టెప్పులు 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాట స్టెప్ లా క‌నిపిస్తుంది. హీరోలిద్ద‌రు ఒక‌రి భుజాల‌పై ఒక‌రు చేతులు వేసుకో వ‌డం..క‌లిపి కాలు క‌ద‌ప‌డం..వెనుక డాన్స‌ర్లు కూడా అదే మూవ్ మెంట్ లో క‌నిపిస్తున్నారు. అన్ని చూస్తుంటే నాటు నాటు స్టెప్ ని రీక్రియేట్ చేసిన‌ట్లే క‌నిపిస్తుంది. దీంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

నాటు నాటు స్టెప్ ని రీక్రియేష‌న్లో ఏమాత్రం తేడా వ‌చ్చినా ఆ ఇద్ద‌రు అన్ని ర‌కాలుగా సిద్దంగా ఉండాలి? అంటూ హెచ్చ‌రిక‌లు జారీ అవుతున్నాయి. పూర్తి పాట రిలీజ్ అయితే గానీ ఆ సంగ‌తేంటో తెలీదు. ఇక టైగ‌ర్ ప్రాష్ గొప్ప డాన్స‌ర్ అన్న సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. నాటు నాటు స్టెప్ ఆయ‌న ముందు జుజూబీ లాంటిందే. కానీ ప‌క్క‌నున్న కోస్టార్ అక్ష‌య్ కుమార్ కి మాత్రం స‌రిగ్గా డాన్సు రాదు. నాటు నాటు వేగాన్ని ఖిలాడీ అందుకున్నాడా? అన్న‌దే పెద్ద సందేహమే. అందులో ఒక‌రు స‌రిగ్గ చేయ‌క‌పోయినా స్టెప్ చెడిపోయిన‌ట్లే.