Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఆ కంటెస్టెంట్ కి వారానికి 2 లక్షల రెమ్యునరేషన్..?

బిగ్ బాస్ సీజన్ 8 లో నబీల్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 9:30 AM GMT
బిగ్ బాస్ 8 : ఆ కంటెస్టెంట్ కి వారానికి 2 లక్షల రెమ్యునరేషన్..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి సీరియల్ బ్యాచ్ ఎక్కువగా దిగారన్న టాక్ అయితే ఉంది. నిఖిల్, ప్రేరణ, యష్మి, మణికంఠ సీరియల్ బ్యాచ్ మొత్తం దించేసారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా బెజవాడ బేబక్క ఇంకా వరంగల్ నబీల్ హౌస్ లోకి వచ్చారు. నబీల్ అఫ్రిది ఎంట్రీ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. మెజారిటీ ఆడియన్స్ కు అతనెవరో తెలియదు ఐతే హౌస్ లో మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉన్న నబీల్ 3, 4 వారాల్లో తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఎక్కడ తన వాయిస్ అవసరమో అక్కడ వినిపిస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 8 లో నబీల్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతను నాలుగు వారాలు సర్వైవ్ అయ్యాడు. ఇదే ఫోర్స్ తో ఆడితే మాత్రం అతను టాప్ 5 కి వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంతేకాదు నబీల్ ని సోనియా టార్గెట్ చేయడం కూడా అతని గ్రాఫ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. నబీల్ కు బయట సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉందని తెలుస్తుంది.

తన యూట్యూబ్ ఛానెల్ లోనే 16.2 లక్షల దాకా ఫాలోవర్స్ ఉన్నారు. నబీల్ ఇన్ స్టాగ్రామ్ కు కూడా 5,88,000 ల దాకా ఫాలోవర్స్ ఉన్నారు. బయట అంతగా తెలియకపోయినా సోషల్ మీడియాలో రెగ్యులర్ టచ్ లో ఉన్న వారికి నబీల్ బాగా తెలుసు. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన నబీల్ ఇప్పుడు హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. ఐతే నబీల్ కి బిగ్ బాస్ వాళ్లు ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతన్నది బయట ఒక న్యూస్ వైరల్ అయ్యింది

వారానికి 2 లక్షలు రెమ్యునరేషన్ గా నబీల్ ని బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ చేశారట. ఐతే వారాలు గడుస్తున్నా కొద్ది అతను చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు. చూస్తుంటే టైటిల్ రేసులో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. ఎలాంటి ఫేక్ లేకుండా తనకు ఏది అనిపిస్తే అది చేస్తూ.. మట్లాడుతున్న నబీల్ మిగతా కంటెస్టెంట్స్ కు టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నాడు. మరి నబీల్ సీజన్ చివరి దాకా ఉంటాడా లేదా అన్నది చూడాలి.